Lady: మహిళా ఉద్యోగితో డిప్యూటీ కలెక్టర్ ?, ఆమె కొడుక్కి, మామకు పర్సనల్ ఫోటోలు పంపించి, భర్త ఎంట్రీ !
అహమ్మదాబాద్: డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న అధికారి మీటింగ్ లు సాటి ఉద్యోగులు, సిబ్బంది వెలుతున్నారు. మీటింగ్ లో కిందిస్థాయి ఉద్యోగుల మీద డిప్యూటి కలెక్టర్ చిందులు వేస్తున్నాడు. సాటి మహిళా ఉద్యోగల పట్ల ఆ డిప్యూటీ కలెక్టర్ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. వివాహం జరిగి భర్తతో కాపురం చేస్తున్న మహిళతో డిప్యూటీ కలెక్టర్ పరిచయం పెంచుకున్నాడు. మహిళా ఉద్యోగి ఇంటికి వెళ్లి వస్తున్న ఆ డిప్యూటీ కలెక్టర్ ఆమెను కూడా ఇంటికి పిలిపించుకున్నాడు. చాలా కాలం ఈ తతంగం జరిగింది. అయితే ఇటీవల డిప్యూటీ కలెక్టర్, ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న ఆ మహిళ మధ్య తేడా వచ్చింది. అంతే అప్పటి నుంచి ఆమెకు అసభ్యకరమైన మెసేజ్ లు చెయ్యడం, బూతు బొమ్మలు, వీడియోలు పంపించడం, ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడటం చేశాడు. తరువాత కథ చాలా వరకు వెళ్లింది. చివరికి మహిళ కొడుక్కి, ఆమె భర్త తండ్రికి ఆమె వ్యక్తిగత ఫోటోలు, బాత్ రూమ్ ఫోటోలు పంపించాడు. డిప్యూటీ కలెక్టర్ తీరుతో విసిగిపోయిన మహిళా ఉద్యోగి భర్త రంగంలోకి దిగడంతో మ్యాటర్ మారిపోయింది.

డిప్యూటీ కలెక్టర్
గుజరాత్ పరిపాలన విభాగం శాఖ (GAC)లో మయాంక్ పటేల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మడాసా జిల్లాలోని సేవాసదన్ లో మయాంక్ విధులు నిర్వహిస్తున్నాడు. డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న మయాంక్ పటేల్ నిర్వహిస్తున్న మీటింగ్ లు సాటి ఉద్యోగులు, సిబ్బంది వెలుతున్నారు. మీటింగ్ లో కిందిస్థాయి ఉద్యోగుల మీద డిప్యూటి కలెక్టర్ మయాంక్ పటేల్ చిందులు వేస్తున్నాడు.

వివాహిత మహిళా ఉద్యోగి మీద డిప్యూటీ కలెక్టర్ కన్నుపడింది
సాటి మహిళా ఉద్యోగల పట్ల ఆ డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. వివాహం జరిగి భర్తతో కాపురం చేస్తున్న అందమైన మహిళా ఉద్యోగినితో డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ పరిచయం పెంచుకున్నాడు. మహిళకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అందమైన తన కిందిస్థాయి మహిళ మీద డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ కన్నుపడింది.

మహిళ ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేశాడు
మహిళా ఉద్యోగి ఇంటికి వెళ్లి వస్తున్న డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ ఆమె కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకున్నాడు. డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ మా ఇంటికి వస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. తరువాత డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ ఆ మహిళా ఉద్యోగితో పాటు ఆమె కుటుంబ సభ్యులను అతని ఇంటికి పిలిపించుకోవడం మొదలు పెట్టాడు. కొంతకాలం రెండు కుటుంబాలు ఒకరి ఇంటికి ఒఖరు వచ్చి వెళ్లారు.

ఆమె ఇంటికి ?......ఏక్ నిరంజన్
రానురాను మహిళ ఇంటికి డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ ఒక్కడే వెళ్లి అక్కడ ఆమె ఇంటిలో గంటలు గంటలు ఉండటం మొదలు పెట్టాడు. తరువాత డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్, ఆ మహిళా ఉద్యోగి మద్య తేడా వచ్చింది. తరువాత మీటింగ్ లో ఆమె పట్ల దురుసగా ప్రవర్తించిన మయాంక్ పటేల్ సాటి ఉద్యోగుల ముందే ఆమెను కించపరిచి మాట్లాడటం, నువ్వు ఉద్యోగానికి పనికిరావు అని తిట్టడం మొదలు పెట్టాడు.

మహిళకు బూతు బొమ్మలు, మెసేజ్ లు పంపించిన డిప్యూటీ కలెక్టర్
ఇటీవల డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్, ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న ఆ మహిళ మధ్య తేడా వచ్చింది. తరువాత డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ తో ఫోన్ లో మాట్లాడటం మానేసిన ఆమె అతని ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టింది. డిప్యూటీ కలెక్టర్ మెసేజ్ లు చేసినా ఆమె రిప్లే ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయింది. అంతే అప్పటి నుంచి డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ ఆమెకు అసభ్యకరమైన మెసేజ్ లు చెయ్యడం, బూతు బొమ్మలు, వీడియోలు పంపించడం, అర్దరాత్రి ఫోన్లు చేసి ఆమెతో అసభ్యంగా మాట్లాడటం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

మహిళ వ్యక్తిగత ఫోటోలు కొడుక్కి, మామకు షేర్ చేశాడు
మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. ఆ సమయంలో తీసుకున్న ఫోటోలను ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ దుర్వినియోగం చేశాడు. చివరికి మహిళ మైనర్ కొడుక్కి, ఆమె భర్త తండ్రికి ఆమె వ్యక్తిగత ఫోటోలు, బాత్ రూమ్ ఫోటోలు పంపించాడు.
Recommended Video

డిప్యూటీ కలెక్టర్ అరెస్టు
డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ తీరుతో విసిగిపోయిన మహిళా ఉద్యోగి భర్త రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదు చేసి అతని మీద కేసు పెట్టాడు. మహిళకు డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ ఫోన్ నెంబర్ నుంచి అసభ్యకరమైన మెసేజ్ లు, ఫోటోలు, బూతు వీడియోలు పంపించినట్లు విచాణలో వెలుగు చూసిందని, ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని గుజరాత్ సైబర్ క్రైమ్ డిప్యూటీ పోలీసు కమీషనర్ అమిత్ వాసవ్ స్థానిక మీడియాకు చెప్పారు. డిప్యూటీ కలెక్టర్ మయాంక్ పటేల్ ఇలాంటి కేసులో అరెస్టు కావడం గుజరాత్ లో కలకలం రేపింది. ఈ దెబ్బతో సాటి అధికారులు హడలిపోయారని తెలిసింది.












Click it and Unblock the Notifications