Lady don: స్టేట్ లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లేడీతో పెళ్లి, హనీమూన్, భార్య చరిత్ర తెలిసి తడిసిపోయింది !
న్యూఢిల్లీ/అహమ్మదాబాద్: మ్యాట్రిమోనియల్ సైట్‌లో అందమైన అమ్మాయిని చూసిన ఓ కుర్రాడు ఆమెను పెళ్లి చేసుకోవాలనే కోరికను ఆమె ముందు వ్యక్తం చేశాడు. అనుకున్నట్లు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు కూడా కొన్ని సార్లు ఆమెను కలిశాడు. పెళ్లయిన ఆరు నెలల తరువాత తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి మామూలు అమ్మాయి కాదని భర్త గ్రహించాడు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఓ లేడీ డాన్, పేరుమోసిన రౌడీ షీటర్, ఆమె మీద లెక్కలేనన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలుసుకున్న యువకుడు బిత్తరపోయాడు. భార్య గురించి రోజుకొక మ్యాటర్ తెలీసి అతని తల దిమ్మతిరిగిపోయింది. పెళ్లి చేసుకుని హనీమూన్‌లో ఎంజాయ్ చేసింది నేను ఓ లేడీ డాన్ తో అని తెలుసుకున్న ఆ యువకుడు హడలిపోయాడు. నా భార్య పెద్ద లేడీ డాన్, మ్యాటర్ తెలీక పెళ్లి చేసుకున్నాను, మీరే నన్ను కాపాండండి సార్ అంటూ భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అమ్మాయి బాగుంది అనుకున్నాడు
గుజరాత్ లోని అహమ్మదాబాద్ నగరానికి చెందిన విమల్ తులసీదాస్ అలియాస్ విమల్ అనే యువకుడికి గత కొన్నాళ్లుగా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించి విమల్ మ్యాట్రిమోనియల్ సైట్లలో అమ్మాయి కోసం వెతికాడు. ఈ సమయంలో, అతను అస్సాంలోని గౌహతికి చెందిన రీటా దాస్ అలియాస్ రీటా అనే అమ్మాయి ఫోటోలు చూసి ఆమెను ఇష్టపడ్డాడు. నాకు చిన్న వయసులోనే పెళ్లయింది. ఇప్పుడు విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నానని విమల్ కు రీటా దాస్ చెప్పింది.

సింపుల్ గా, సీక్రేట్ గా పెళ్లి
రీటా దాస్ మాటలు నమ్మిన విమల్ ప్రతిరోజూ ఆమెతో ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టాడు. చివరకు ఓ రోజు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారం విమల్ అహమ్మదాబాద్‌లో సింపుల్‌గా రీటా దాస్ ను వివాహం చేసుకున్నారు. రీటా దాస్ ను పెళ్లి చేసుకున్న విమల్ ఆమెతో ఆనందంగా జీవించడం మొదలు పెట్టారు. పెళ్లి చేసుకున్న తరువాత రీటా దాస్ తో ఆమె భర్త విమల్ హనీమూన్ కు వెళ్లి వచ్చాడు.

కోర్టు వాయిదాకు వెళ్లిన భార్య
పెళ్లయిన ఆరు నెలల తరువాత ఓ రోజు మా ఫ్యామిలీకి సంబంధించిన భూమి విషయంలో కోర్టులో కేసు విచారణలో ఉందని, కేసు వాయిదాకు వెళ్లి వస్తానని భర్త విమల్ కు చెప్పిన రీటా దాస్ గౌహతి వెళ్లింది. అయితే నాలుగు రోజులు గడిచినా రీటా దాస్ ఆచూకీ లభించకపోవడం, ఆమె ఫోన్ కూడా చెయ్యకపోవడంతో భర్త విమల్ హడలిపోయాడు. చివరికి విమల్ అతని భార్య రీటా దాస్ కు పదేపదే ఫోన్ చేసినా ఆమె నుంచి ఎలాంటి స్పందనలేదు. కనీసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా రీటా దాస్ మాత్రం ఆమె భర్త విమల్ కు సమాధానం ఇవ్వలేదు.

జైల్లో భార్య..... లాయర్ కు లక్ష పంపించిన భర్త
ఒకరోజు విమల్ అతని భార్య రీటా దాస్ ఫోన్ నెంబర్ కు ఫోన్ చెయ్యడంతో ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసిన లాయర్ మీ భార్య జైల్లో ఉందని, బెయిల్ కోసం లక్ష పూచీకత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించిందని చెప్పాడు. లాయర్ మాటలతో ఆందోళన చెందిన విమల్ ఆ లాయర్ కు లక్ష రూపాయలు పంపించాడు. అయితే న్యాయవాది పంపిన కోర్టు పత్రాల్లో భార్య పేరు రీటా దాస్ కాకుండా రీటా చౌహాన్ అని ఉండడంతో ఆమె భర్త విమల్ కు అనుమానం వచ్చింది. నా భార్య పేరు రీటా దాస్ అని, మీరు పంపించిన బెయిల్ పత్రాల్లో రీటా చౌహాన్ అని ఉందని విమల్ ఆ లాయర్ ను ప్రశ్నించాడు.

అసోం స్టేట్ లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
విమల్ మరోసారి లాయర్‌ను సంప్రధిస్తే అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. చివరకు మరో మార్గం కనిపించకపోవడంతో విమల్ అతని భార్య రీటా చౌహాన్ పేరుతో గూగుల్‌లో వెతికాడు. ఆ తరువాత విమల్ కు మతిపోయింది, అసోంలో తన భార్య రీటా దాస్ అలియాస్ రీటా చౌహాన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని భర్తకు తెలిసింది. 5 వేలకు పైగా కార్ల చోరీ కేసులు, ఖడ్గమృగాలను వేటాడిందని, అక్రమ ఆయుధాల రవాణా చేసిందని తదితర క్రిమినల్ కేసులు రీటా దాస్ అలియాస్ రీటా చౌహాన్ మీద నమోదయ్యాయని తెలుసుకున్న ఆమె భర్త విమల్ కుప్పకూలిపోయాడు.

నన్ను మీరే కాపాడండి సార్
విమల్ నేరుగా గౌహతికి పరుగు తీసి అక్కడి పోలీసులను సంప్రధించాడు. జాతీయస్థాయిలో విదేశీ కార్ల దొంగతనం కేసులో తన భార్య రీటా దాస్ అలియాస్ రీటా చౌహాన్ పేరు చూసి నేను షాక్ అయ్యానని, తనకు ఏ పాపం తెలీదని, తనను మోసం చేసి ఆమె పెళ్లి చేసుకుందని విమల్ పోలీసుల ముందు లబోదిబో అన్నాడు. ఇప్పటికే ఈ కేసుల్లో రీటా మొదటి భర్త అనిల్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మోసం గురించి తెలుసుకున్న రెండో భర్త విమల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విమల్ కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు.

కిలాడీ రీటా చౌహాన్
ఇంత జరిగిన తరువాత విమల్ అతని భార్య రీటా దాస్ కు ఫోన్ చేసి ఎందుకు నన్ను మోసం చేశావు అని ప్రశ్నించాడు. ఈ సమయంలో జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మనం ఏం చెయ్యలేమని చెప్పిన రీటా చౌహాన్ ఆమె రెండో భర్త విమల్ ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టింది. విమల్ అతని భార్య రీటా దాస్ అలియాస్ రీటా చౌహాన్ మీద అహమ్మదాబాద్ లోని పోర్‌బందర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. విమల్ పోర్ బందర్ లోని మహారాజ్‌బాగ్ ప్రాంతంలో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications