Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: ఇంట్లో మొగుడు, ఫేస్ బుక్ లో ప్రియుడు, సీక్రేట్ ఎంజాయ్, సీన్ రివర్స్ తో ఆసుపత్రిలో ఆత్మహత్య !

చెన్నై/ తుత్తుకుడి: భర్తతో సంతోషంగా కాపురం చేస్తున్న భార్య ఇద్దరు కూతుర్లకు తల్లి అయ్యింది. వ్యాపారం చేస్తున్న భర్త ప్రతిరోజు బయటకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. రోజూ ఇంట్లో ఖాళీగా ఉంటున్న భార్య సోషల్ మీడియాలో కాలం గడుపుతోంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో భార్య చాలా యాక్టీవ్ గా ఉంటున్నది. ఇదే సమయంలో ఫేస్ బుక్ లో ఓయువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. చాలా కాలం ఫేస్ బుక్ లో, ఇన్ స్టాగ్రామ్ లో చాటింగ్ చేసుకుంటున్న వివాహిత మహిళ తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. యువకుడికి ఇంకా వివాహం కాకపోవడంతో నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదని ఆమె చెప్పింది. ఇద్దరూ నేరుగా కలుసుకుని శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఇటీవల అనుకోకుండా ప్రియుడు ఆమె ఇంటికి వెళ్లిపోయాడు. ఆసమయంలో తన ప్రియురాలికి వివాహం అయ్యి ఇద్దరు కూతుర్లు ఉన్నారని తెలుసుకున్న ప్రియుడు రగిలిపోయి ఆమెను లాక్కొని వెళ్లి నన్ను మోసం చేసిందని పోలీసు కేసు పెట్టాడు. పోలీస్ స్టేషన్ లో అస్వస్థతకు గురైన మహిళను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. తన భార్య కనపడటం లేదని భర్త పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య వేరే పోలీస్ స్టేషన్ లో ఉందని తెలుసుకున్న భర్త అక్కడికి బయలుదేరాడు. అప్పటికే ఆమె ఆసుపత్రిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 ఇద్దరు పిల్లల తల్లి

ఇద్దరు పిల్లల తల్లి

తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలోని గణేశపురంలో రంగన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు, ఐదు సంవత్సరాల క్రితం ఐశ్వర్య (28) అనే యువతితో రంగన్ వివాహం జరిగింది. పెద్దల అంగీకారంతోనే రంగన్, ఐశ్వర్య వివాహం జరిగింది. భర్త రంగన్ తో సంతోషంగా కాపురం చేస్తున్న అతని భార్య ఐశ్వర్య ఇద్దరు కూతుర్లకు తల్లి అయ్యింది.

సోషల్ మీడియా.....ఫేస్ బుక్ పిచ్చి

సోషల్ మీడియా.....ఫేస్ బుక్ పిచ్చి


వ్యాపారం చేస్తున్న రంగన్ ప్రతిరోజు బయటకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. రోజూ ఇంట్లో ఖాళీగా ఉంటున్న ఐశ్వర్య సోషల్ మీడియాలో కాలం గడుపుతోంది.. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఐశ్వర్య చాలా యాక్టీవ్ గా ఉంటున్నది. సోషల్ మీడియాలో ఐశ్వర్యకు చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు స్నేహితులు అయ్యారు.

పెళ్లి కాలేదని చెప్పిన లేడీ

పెళ్లి కాలేదని చెప్పిన లేడీ

సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న ఐశ్వర్యకు ఫేస్ బుక్ లో రామనాథపురం జిల్లాలోని కొంబుటిలో నివాసం ఉంటున్న విజయ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. చాలా కాలం ఫేస్ బుక్ లో, ఇన్ స్టాగ్రామ్ లో చాటింగ్ చేసుకుంటున్న ఐశ్వర్య, విజయ్ తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. విజయ్ కు ఇంకా వివాహం కాలేదు. నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదని ఐశ్వర్య ఆమె ప్రియుడు విజయ్ కు చెప్పింది.

 ప్రియుడికి షాక్

ప్రియుడికి షాక్

కొంతకాలం నుంచి ఐశ్వర్య ఆమె ప్రియుడు విజయ్ ను నేరుగా కలుసుకుని శారీరక సంబంధం పెట్టుకుంది. ఇంటి నుంచి బయటకు వెలుతున్న ఐశ్వర్య విజయ్ తో ఎంజాయ్ చేసి తరువాత ఇంటికి వెళ్లిపోతా ఉంది. ఇటీవల అనుకోకుండా ప్రియుడు విజయ్ అతని ప్రియురాలు ఐశ్వర్య ఇంటికి వెళ్లిపోయాడు. ఆసమయంలో తన ప్రియురాలు ఐశ్వర్యకు ఇంతకు ముందే వివాహం అయ్యిందని, ఇద్దరు కూతుర్లు ఉన్నారని తెలుసుకున్న ప్రియుడు విజయ్ ఆమె మీద రగిలిపోయాడు.

ప్రియురాలిని ఈడ్చుకుని వెళ్లి కేసు పెట్టిన ఫేస్ బుక్ ప్రియుడు

ప్రియురాలిని ఈడ్చుకుని వెళ్లి కేసు పెట్టిన ఫేస్ బుక్ ప్రియుడు


తనను మోసం చేసి తన దగ్గర ఇంతకాలం డబ్బులు గుంజుకుని మోసం చేసిందని, నా జీవితం నాశనం చెయ్యడానికి ప్రయత్నించిందని విజయ్ అతని ప్రియురాలు ఐశ్వర్య మీద కేసు పెట్టాడు. ఐశ్వర్యను ఈడ్చుకుని వెళ్లిన విజయ్ రామనాథపురం పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఐశ్వర్యను విచారణ చేస్తున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

భర్త వచ్చేలోపు ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్న భార్య

భర్త వచ్చేలోపు ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్న భార్య


తన భార్య ఐశ్వర్య కనపడటం లేదని రంగన్ తిరుచెందరూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నీ భార్య రామనాథపురం పోలీస్ స్టేషన్ లో ఉందని తిరుచందూర్ పోలీసులు రంగన్ కు చెప్పారు. రంగన్ రామనాథపురం బయలుదేరాడు. అయితే అప్పటికే ఆసుపత్రిలో ఉన్న ఐశ్వర్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అసలు మ్యాటర్ తెలీదు

అసలు మ్యాటర్ తెలీదు


మొదట తాను భర్త రంగన్ తో కలిసి ఇంటికి వెళ్లను అని ఐశ్వర్య చెప్పిందని, తరువాత ఆమె అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించామని రమానాథపురం పోలీసులు అంటున్నారు. భర్త రంగన్ కు ప్రియుడి విషయం తెలిసిపోయిందని ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుందా ?, లేకపోతే ప్రియుడు విజయ్ పెళ్లి చేసుకోనని ఎదురుతిరగడం వలన ఆత్మహత్య చేసుకుందా ? అని కచ్చితంగా తెలీయడం లేదని, విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. ఫేస్ బుక్ ప్రియుడి కారణంగా వివాహిత మహిళ ఐశ్వర్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న ఆమె ప్రియుడు విజయ్ పరారైనాడు. ఫేస్ బుక్ ప్రియుడు కేసు పెట్టడంతో అవమానంతో ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+