Lady: అపార్ట్ మెంట్ బాత్ రూమ్ లో శవమై కనిపించిన యువతి, పని చేస్తున్న చోటే నివాసం, టెక్కీ ఫ్లాట్ లో !

బెంగళూరు: సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అతని భార్య, పిల్లలతో కలిసి విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. కరోనా వైరస్ దెబ్బతో ఇంట్లో పని చేస్తున్న మహిళను ఉద్యోగంలో నుంచి తీసేశారు. తరువాత ఆయన ఇంటిలో ఓ యువతి ఇంటి పని చెయ్యడానికి ఉద్యోగంలో చేరింది. పని చేస్తున్న యజమాని అపార్ట్ మెంట్ లోని ఓ ప్రత్యేక గదిలో ఆ యువతి నివాసం ఉంటూ ఇంటి పని చేసుకుంటున్నది. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులను చూడటానికి వెలుతున్న ఆ యువతి వారి ఇంటిలోనే ఉండిపోయింది. ఉదయం ఇంటి యజమాని ఆమె గది తలుపు కొట్టినా ఎలాంటి స్పందనలేదు. ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆయువతి బాత్ రూమ్ లో ఉరి వేసుకుని ఉన్న విషయం గుర్తించామని ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి యజమాని టార్చర్ పెట్టాడని, మా కూతురి చావుకు అతనే కారణం అని యువతి తల్లి సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగి మీద కేసు పెట్టింది.
ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దిగారు.

 ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ?

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ?

బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ సమీపంలోని బెళ్లందూరులోని ఎంబస్సి అపార్ట్ మెంట్ లో వివేక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న వివేక్ అతని భార్య, పిల్లలతో కలిసి విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. కరోనా వైరస్ దెబ్బతో ఇంట్లో పని చేస్తున్న మహిళను వివేక్ గత ఏడాది ఉద్యోగంలో నుంచి తీసేశాడు.

 ఇంటి పని చేస్తూ అక్కడే ఉంటున్న యువతి

ఇంటి పని చేస్తూ అక్కడే ఉంటున్న యువతి

8 నెలల క్రితం వివేక్ ఇంటిలో కవిత (19) అనే యువతి ఇంటి పని చెయ్యడానికి ఉద్యోగంలో చేరింది. పని చేస్తున్న యజమాని వివేక్ అపార్ట్ మెంట్ లోని ఓ ప్రత్యేక గదిలో కవిత నివాసం ఉంటూ ఇంటి పని చేసుకుంటున్నది. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులను చూడటానికి వెలుతున్న కవిత వివేక్ ఇంటిలోనే పూర్తిగా ఉండిపోయింది.

 బాత్ రూమ్ లో శవమైయ్యింది

బాత్ రూమ్ లో శవమైయ్యింది

ఎప్పటిలాగా రాత్రి పని ముగించుకున్న కవతి ఆమె రూమ్ లోకి వెళ్లి నిద్రపోయిందని తెలిసింది. మరుసటి రోజు ఉదయం ఎంతసేపు అయినా కవిత రూమ్ లో నుంచి బయటకు రాకపోవడంతో వివేక్ ఆమె గది దగ్గరకు వెళ్లి చూశాడు. ఇంటి యజమాని వివేక్ కవతి గది తలుపు కొట్టినా ఎలాంటి స్పందనలేదు. కవిత రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా ఆమె బాత్ రూమ్ లో ఉరి వేసుకుని ఉన్న విషయం గుర్తించామని ఇంటి యజమాని వివేక్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

 టార్చర్ పెట్టాడని కేసు పెట్టిన యువతి తల్లి

టార్చర్ పెట్టాడని కేసు పెట్టిన యువతి తల్లి

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాత్ రూమ్ లో ఉరి వేసుకున్న స్థితిలో శవమైన కవిత మృతదేహాన్ని పరిశీలించి ఆసుపత్రికి తరలించారు. ఇంటి యజమాని వివేక్, అతని కుటుంబ సభ్యులు టార్చర్ పెట్టారని, మా కూతురు కవిత చావుకు వాళ్లే కారణం అని యువతి తల్లి సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగి వివేక్ మీద కేసు పెట్టింది. ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దింపిన పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ కంపెనీ ఉద్యోగి అపార్ట్ మెంట్ లోని బాత్ రూమ్ లో హౌస్ కీపింగ్ చేస్తున్న యువతి శశమై కనిపించడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+