వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Wife: కూతురికి పెళ్లి చేశారు, ఆంటీ మీద అంకుల్ కు డౌట్, ఇంటికి వెళ్లి ఏం చేశాడంటే ?, బెడ్ రూమ్ లో !

|
Google Oneindia TeluguNews

పూణే/ముంబాయి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులు వారి కుమార్తెకు పెళ్లి చేశారు. కొంతకాలంగా భర్త అతని భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన భార్య కోసం ఆమె ప్రియుడు వచ్చి వెలుతున్నాడని భర్తకు తెలిసింది. తాను ఊర్లో లేని సమయంలో తన భార్య ప్రియుడితో షికార్లకు వెలుతోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇంటికి వెళ్లిన భర్త రగిలిపోయి కత్తి తీసుకుని అతని భార్యను ఇష్టం వచ్చినట్లు పొడిచేసి హత్య చేశాడు. ఆంటీని చంపేసిన ఆమె భర్త విషం తాగేశాడు.

Negligence: ఆధార్ కార్డు లేదని సాకుతో ? తల్లి, కవల పిల్లలు ప్రాణాలు పోయాయి, ప్రభుత్వ ఆసుపత్రిలో !Negligence: ఆధార్ కార్డు లేదని సాకుతో ? తల్లి, కవల పిల్లలు ప్రాణాలు పోయాయి, ప్రభుత్వ ఆసుపత్రిలో !

దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

మహారాష్ట్రలోని పూణేలోని ఎరవాడలో అనీల్ మనోహర్ తంబూర్కర్ అలియాస్ అనీల్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 27 సంవత్సరాల క్రితం శిల్పా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను అనీల్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న అనీల్, శిల్పా దంపతులు 20 సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు.

కూతురికి పెళ్లి చేసిన దంపతులు

కూతురికి పెళ్లి చేసిన దంపతులు

అనీల్, శిల్పా దంపతులకు ఓ కుమార్తె ఉంది. రెండు సంవత్సరాల క్రితం శిల్పా, అనీల్ దంపతులు వారి కుమార్తెకు వివాహం చేసి అత్తారింటికి పంపించారు. కూతురు ఆమె భర్తతో కాపురం చేస్తూ ఆత్తారింటిలో సంతోషంగా ఉంటోంది. కూతురికి పెళ్లి చేసిన తరువాత శిల్పా, అనీల్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

ఆంటీ మీద అంకుల్ కు డౌట్

ఆంటీ మీద అంకుల్ కు డౌట్

కొంతకాలంగా అనీల్ అతని భార్య శిల్పా మీద అనుమానం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన భార్య శిల్పా కోసం ఓ యువకుడు వచ్చి వెలుతున్నాడని, ఇద్దరూ ఇంటిలోనే రొమాన్స్ చేస్తున్నారని అనీల్ కు తెలిసింది. తాను ఊర్లో లేని సమయంలో తన శిల్పా బయటకు వెళ్లి ఆమె ప్రియుడితో షికార్లకు వెలుతోందని అనీల్ అనుమానం పెంచుకున్నాడు.

భార్యను స్పాట్ లో చంపేశాడు

భార్యను స్పాట్ లో చంపేశాడు

సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటికి వెళ్లిన అనీల్ రగిలిపోయాడు. అక్కడ ఏం జరిగిందో ఏమోకాని ఆవేశంతో ఊగిపోయిన అనీల్ కత్తి తీసుకుని అతని భార్య శిల్పా ముఖం, ఛాతీ, కడుపులో, గొంతులో ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. తీవ్రగాయాలైన శిల్పా స్పాట్ లో చనిపోయింది. భార్య శిల్పాను హత్య చేసిన తరువాత అనీల్ విషం తాగేశాడు.

ఏం జరిగిందో తెలీదు.... ఐసీయూలో భర్త

ఏం జరిగిందో తెలీదు.... ఐసీయూలో భర్త

స్థానికంగా నివాసం ఉంటున్న శిల్పా స్నేహితురాలు ఇంటికి వెళ్లి చూడగా బెడ్ మీద శిల్పా రక్తపుమడుగులో పడిఉండటం, పక్కనే అనీల్ కూడ పడిఉండటం చూసి గట్టిగా కేకలు వేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అనీల్ ను ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. భార్య మీద అనీల్ కు చాలా అనుమానం ఉందని, అందుకే ఆమెను హత్య చేశాడని, అయితే ఆరోజు ఇంట్లో ఏం జరిగిందో ఏమో తెలీయడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
Lady: Husband kills his suspecting her fidelity, attempts suicide in Pune
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X