Lady judge: మహిళా న్యాయమూర్తితో గేమ్స్, ఫోటోలు మార్ఫింగ్ చేసి ?, వాడి కథ కంచికే !
కోర్టు ముందు, న్యాయమూర్తి ముందు చిల్లరవేషాలు వేస్తే ఊహించని పరిణామాలు ఎదురౌతాయని అందరూ హడలిపోతుంటారు. అయితే ఓ కేటుగాడు ఏకంగా మహిళా న్యాయమూర్తితో గేమ్స్ ఆడాడు.
జైపూర్/రాజస్థాన్: సామాన్య ప్రజలను, అమాయకులను, ప్రేమించి మోసం చేశారని కొందరు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చెయ్యడం మనం చూస్తూనే ఉన్నాము. రాజకీయ నాయకులు, పోలీసులు, అధికారులు సైతం కోర్టులు, న్యాయమూర్తులు అంటే భయపడిపోతారు. కోర్టు ముందు, న్యాయమూర్తి ముందు చిల్లరవేషాలు వేస్తే ఊహించని పరిణామాలు ఎదురౌతాయని అందరూ హడలిపోతుంటారు. అయితే ఓ కేటుగాడు ఏకంగా మహిళా న్యాయమూర్తితో గేమ్స్ ఆడాడు. వాడు ఎక్కడ ఉన్నాడో చూడండిరా అంటూ పోలీసులు రంగంలోకి దిగారు. మహిళా న్యాయమూర్తితో పెట్టుకున్న వాడు ఎవడైనా సరే వాడి అంతు చూడాలని పోలీసు అధికారులు డిసైడ్ అయ్యారు. కాలాంతకుడి కోసం పోలీసులు ప్రత్యేకంగా టీమ్ లు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

మహిళా న్యాయమూర్తికి పార్శిల్
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన మహిళా న్యాయమూర్తికి గత ఫిబ్రవరి 7వ తేదీన ఓ పార్శిల్ వచ్చింది. ఓ యువకుడు కోర్టులోకి వెళ్లి మహిళా న్యాయమూర్తి అసిస్టెంట్‌కి పార్శిల్ ఇచ్చి వెళ్లిపోయాడు. అసిస్టెంట్ ఆ పార్శిల్ తీసుకుని వెళ్లి మహిళా జడ్జికి ఇచ్చాడు. మహిళా జడ్జి ఆ పార్శిల్ ఎవరు పంపించారు అని దానిని తీసి చూశారు. పార్శిల్‌లో స్వీట్ బాక్స్ తో పాటు ఓ ఎన్వలప్ కవర్ ఉన్నాయి. మహిళా న్యాయమూర్తి కవర్ తీసి చూసి షాక్ అయ్యారు.

వీడికి ఎంత ధైర్యం ?
ఎన్వలప్ కవర్ లో మహిళా న్యాయమూర్తి ఫోటోలను అసభ్యంగా ఎడిట్, మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఉండటంతో ఆమె షాక్ అయ్యారని తెలిసింది.
అదే కవర్ లో మహిళా న్యాయమూర్తిని అసభ్యకరమైన పదాలతో దూషించి రాపిన లెటర్ ఉందని తెలిసింది. మహిళా న్యాయమూర్తి భర్త ఫోన్ నంబర్, ఆయన వివరాలు కూడా ఉన్నాయని సమాచారం. కొంతసేపు మహిళా న్యాయమూర్తి షాక్ అయ్యారని తెలిసింది.

రూ. 20 లక్షలు డిమాండ్
పార్శిల్ పంపిన కాలాంతకుడు సోషల్ మీడియా నుంచి మహిళా న్యాయమూర్తి ఫోటోలు డౌన్ లోడ్ చేసి అతనికి ఎలా కావాలో అలా వాటిని మార్ఫింగ్, ఎడిటింగ్ చేసి వాటిని ప్రింట్ తీసి ఆమెకు పంపించాడు. తనకు రూ. 20 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని కిరాతకుడు మహిళా న్యాయమూర్తిని బెదిరించాడు.

రెండోసారి కోరియర్
అయితే మొదట మహిళా న్యాయమూర్తి పరువు పోతుందని ఆందోళన చెందిన కొన్ని రోజులు మౌనంగా ఉన్నారని తెలిసింది. ఫిబ్రవరి 27వ తేదీన మహిళా న్యాయమూర్తి ఇంటికి ఇలాంటి మరో పార్శిల్ వచ్చింది. తనను ఎవరో కావాలని ఫాలో అవుతున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని గుర్తించిన మహిళా న్యాయమూర్తి జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాడు ఎక్కడ ఉన్నాడో చూడండి
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టులో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోర్టుకు పార్శిల్ ఇచ్చిన యువకుడి వివరాలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ క్లిప్పింగ్స్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు విచారణ వేగవంతం చేశారు. మహిళా న్యాయమూర్తికి ఇలాంటి బెదిరింపులు రావడం రాజస్థాన్ లో కలకలం రేపింది. అయితే మహిళా న్యాయమూర్తితో గేమ్స్ ఆడిన కేటుగాడు చిక్కితే మాత్రం వాడికి చిత్రాన్నం గ్యారెంటీ అని పోలీసులు అంటున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications