Lady leader: ఇంట్లో మాయం, చెట్టుకు వేలాడుతూ శవమైన లేడీ, అదే చెట్టుకు మరో శవం, ఏం జరిగింది !
బెంగళూరు/ కొడుగు: రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నారు. గత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో లేడీ రిజర్వేషన్ తో ఆ కుటుంబంలోని మహిళ ఎన్నికల్లో పోటీచేసి గ్రామ పంచాయితీ సభ్యురాలిగా విజయం సాధించింది. గ్రామ పంచాయితీ పరిధిలోని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి లేడీ లీడర్, ఆమె భర్త ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన గ్రామ పంచాయితీ సభ్యురాలు కనపడకుండా పోయింది. లేడీ లీడర్ కోసం బంధుల ఇళ్లు, స్నేహితుల నివాసాల్లో గాలించిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేడీ లీడర్ కనపడలేదని మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలించారు. ఇదే సమయంలో ఓ ప్రాంతంలో లేడీ లీడర్ చెట్టుకు శవమై కనిపించింది. అదే చెట్టుకు మరో వ్యక్తి కూడా శవమై కనిపించడం కలకలం రేపింది. లేడీ లీడర్ తో పాటు శవమై కనిపించిన బంధువులు ఈ దెబ్బతో హడలిపోయారు. లేడీ లీడర్ తో పాటు ఆ వ్యక్తి ఎందుకు శవమైనాడు ? అనే విషయం అంతుచిక్కడం లేదని పోలీసులు అంటున్నారు.

రాజకీయల బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ
కర్ణాటకలోని కొడుగు జిల్లా మడికేర తాలుకాలోని చెంబుదారు గ్రామంలో కమలా (35) అనే మహిళ నివాసం ఉంటున్నారు. కమలా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కమలా కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో మంచి పేరు పెట్టుకున్నారు. గత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో లేడీ రిజర్వేషన్ తో ఆ కుటుంబంలోని కమలా ఎన్నికల్లో పోటీచేసి గ్రామ పంచాయితీ సభ్యురాలిగా విజయం సాధించారు.

ఇంటి నుంచి వెళ్లి మాయం అయిన కమలా
గ్రామ పంచాయితీ పరిధిలోని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి లేడీ లీడర్ కమలా, ఆమె భర్త ప్రయత్నిస్తున్నారు. చాలా మంది గ్రామస్తులు కమలా ఇంటి దగ్గరకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలని వారికి మని చేస్తున్నారు. ఇదే సమయంలో బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన గ్రామ పంచాయితీ సభ్యురాలు కమలా కనపడకుండా పోయింది.

పోలీసు కేసు పెట్టిన ఫ్యామిలీ
లేడీ లీడర్ కమలా కోసం బంధుల ఇళ్లు, స్నేహితుల నివాసాల్లో గాలించిన కుటుంబ సభ్యులు చివరికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేడీ లీడర్ కమలా కనపడలేదని మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం అనేక ప్రాంతాల్లో గాలించారు. కమలా మొబైల్ ఫోన్ కూడా బుధవారం రాత్రి నుంచి స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

ఒకే చెట్టుకు రెండు శవాలు
పోలీసులు, కుటుంబ సభ్యులు కమలా కోసం గాలిస్తున్న సమయంలో ఓ ప్రాంతంలో లేడీ లీడర్ చెట్టుకు శవమై కనిపించింది. అదే చెట్టుకు మరో కొమ్మకు ముత్తు (52) అనే వ్యక్తి కూడా శవమై కనిపించడంతో స్థానికులు హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

సమీప బంధువులు..... అసలు కథ ?
ఇంటి నుంచి బయటకు వెళ్లి కనపడకుండా పోయిన కమలా శవమై కనిపించిన చెట్టుకే వేలాడుతున్న ముత్తు కూడా బుధవారం సాయంత్రం నుంచి కనపడటం లేదని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. కమలా, ముత్తు ఇద్దరూ సమీప బంధువులు అని పోలీసులు అంటున్నారు. అయితే ఒకేసారి కమలా, ముత్తు చెట్టుకు శవాలై వేలాడటం వెనుక అసలు కథ ఏమిటి ? అనే విషయం తెలీడం లేదని పోలీసులు అంటున్నారు.

ఆత్మహత్య చేసుకున్నారా ?, హత్య చేసి శవాలు వేలాడదీశారా
కమలా, ముత్తు ఆత్మహత్య చేసుకున్నారా ?, లేక ఎవరైనా చంపేసి శవాలు చెట్టుకు వేలాడదీశారా ?, వీరి మద్య ఎలాంటి సంబంధం ఉంది ? అనే విషయం తెలీడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఇంటి నుంచి బమటకు వెళ్లి మాయం అయిన లేడీ లీడర్ కమలాతో పాటు మరో వ్యక్తి కూడా అదే చెట్టుకు శవమై కనిపించడం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications