Lady: మరదలితో అక్క మొగుడు క్లోజ్, ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టింది, కత్తితో పొడిచి పారేసిన బావ !
పాట్నా: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భార్యకు ఓ చెల్లెలు ఉంది. మరదలితో అక్క మొగుడు చనువుగా ఉంటున్నాడు. మరదలికి అతను ప్రతినిత్యం ఫోన్లు చేసి జోకులు వేస్తూ మాట్లాడాడు. ఇదే సమయంలో భార్య గర్బవతి అయ్యి పుట్టింటికి వెళ్లింది. భార్య పుట్టింటిలో ఉన్న సమయంలో భర్త అతని మరదలికి ప్రతిరోజు లెక్కలేనన్ని సార్లు ఫోన్లు చేసి మాట్లాడాడు. నెల రోజు తరువాత భార్య పాపకు జన్మనిచ్చింది. నీకు పాప పుట్టిందని భార్య కుటుంబ సభ్యులు భర్తకు ఫోన్ చేసి చెప్పారు. అయితే పాప పుట్టిన తరువాత భర్త ఆసుపత్రికి వెళ్లి భార్యను పలకరించలేదు. పాపను చూడటానికి ఒక్కసారి కూడా వెళ్లలేదు.
మరదలికి మాత్రం ఫోన్లు చేసి మాట్లాడుతున్న అతను కాలం గడిపేశాడు. తన అక్క, అక్క బిడ్డను చూడటానికి బావ రాలేదనే మరదలు రగిలిపోయింది. బావ మీద కోపంతో మరదలు అతని ఫోన్ నెంబర్ల బ్లాక్ లిస్టులో పెట్టింది. 20 రోజుల నుంచి మరదలితో మాట్లాడాలని బావ లెక్కలేనన్ని సార్లు ఫోన్లు చేశాడు. చివరికి విసిగిపోయిన బావ నేరుగా భార్య పుట్టింటికి వెళ్లి కత్తితో అతని మరదలిని ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. తీవ్రగాయాలైన మరదలు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నదని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. బావ ఫోన్ నెంబర్ ను అతని మరదలు ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టింది అని అసలు మ్యాటర్ తెలుసుకున్న బంధువులు షాక్ అయ్యారు.

దంపతుల హ్యాపీలైఫ్
బీహార్ లోని పాలీగంజ్ సమీపంలోని కర్జా గ్రామంలో సోను కుమార్ అనే యువకుడు ఉన్నాడు. మూడు సంవత్సరాల క్రితం సోనూ కుమార్ కు నౌబత్ పురలో నివాసం ఉంటున్న లక్ష్మీ అనే మహిళతో వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న సోను కుమార్, లక్ష్మీ దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

భార్య చెల్లెలితో బావ క్లోజ్
సోను కుమార్ భార్య లక్ష్మీకి ఉమా అనే చెల్లెలు ఉంది. మరదలు ఉమాతో అక్క మొగుడు సోను కుమార్ చాలా చనువుగా ఉంటున్నాడు. మరదలు ఉమాకు ప్రతినిత్యం ఫోన్లు చేస్తున్న సోను జోకులు వేస్తూ మాట్లాడాడు. ఇదే సమయంలో సోనూ భార్య లక్ష్మీ గర్బవతి అయ్యి పుట్టింటికి వెళ్లింది. లక్ష్మీ పుట్టింటిలో ఉన్న సమయంలో ఆమె భర్త సోనూ అతని మరదలు ఉమాకు ప్రతిరోజు లెక్కలేనన్ని సార్లు ఫోన్లు చేసి మాట్లాడాడు.

కూతురు పుట్టినా చూడటానికి వెళ్లలేదు
భార్య లక్ష్మీ పుట్టింటికి వెళ్లిన నెల రోజు తరువాత ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. నీకు పాప పుట్టిందని లక్ష్మీ కుటుంబ సభ్యులు ఆమె భర్త సోనూకు ఫోన్ చేసి చెప్పారు. అయితే పాప పుట్టిన తరువాత సోనూ ఆసుపత్రికి వెళ్లి అతని భార్య లక్ష్మీని పలకరించలేదు. పాపను చూడటానికి సోనూ ఒక్కసారి కూడా ఆసుపత్రికి వెళ్లలేదు. మరదలు ఉమాకుకి మాత్రం ఫోన్లు చేసి మాట్లాడుతున్న సోనూ కొన్ని రోజులు కాలం గడిపేశాడు.

బావ ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టిన మరదలు
తన అక్క లక్ష్మీని, పాపను చూడటానికి మా బావ సోనూ రాలేదనే మరదలు ఉమా రగిలిపోయింది. బావ సోనూ మీద కోపంతో మరదలు ఉమా అతని ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టింది. 20 రోజుల నుంచి మరదలు ఉమాతో మాట్లాడాలని సోనూ లెక్కలేనన్ని సార్లు ఫోన్లు చేశాడు. చివరికి విసిగిపోయిన సోనూ నేరుగా భార్య లక్ష్మీ పుట్టింటికి వెళ్లి కత్తితో అతని మరదలు ఉమాను ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు.

ఐసీయూలో మరదలు
తీవ్రగాయాలైన సోనూ మరదలు ఉమా ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నదని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. బావ సోనూ ఫోన్ నెంబర్ ను అతని మరదలు ఉమాను ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టింది అని అసలు మ్యాటర్ తెలుసుకున్న బంధువులు షాక్ అయ్యారు. లక్ష్మీ ఆసుపత్రిలో ఉన్న సమయంలో బిల్లు చెల్లించడానికి రావాలని ఉమా ఆమె బావ సోనూ ఏమాత్రం పట్టించుకోలేదని, ఆసుపత్రి బిల్లు కూడా కట్టడానికి సోనూ రాలేదని ఉమా అతని ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్టులో పెట్టిందని పోలీసు అధికారులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications