Wife: అర్దరాత్రి భార్యను ఇంటి ముందు నిలబెట్టి నరికి చంపేసిన భర్త, కూతురికి పెళ్లైయ్యింది, భర్తకు ?
చెన్నై/ శివగంగై: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతుల కుమార్తెకు పెళ్లి చెయ్యడంతో ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేస్తూ అత్తారింటిలో ఉంటున్నది. దంపతులు మాత్రమే వారి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. అర్దరాత్రి నిద్రలేచిన భర్త ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లాడు. తరువాత ఇంట్లో ఉన్న భార్యను బయటకు రావాలని చెప్పాడు. ఇంటి బయటకు వచ్చిన భార్య తల మీద కొడవలితో దారుణంగా నరికిన భర్త ఆమెను స్పాట్ లో చంపేయడం కలకలం రేపింది.

కూతురికి పెళ్లి చేశారు
తమిళనాడులోని శివగంగై జిల్లాలోని తిరుపత్తూర్ సమీపంలోని వెలయపట్టిలో సెల్వం (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు, వడ్రంగి పని చేస్తున్న సెల్వం కొన్ని సంవత్సరాల క్రితం మల్లిక (49) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. సెల్వం, మల్లిక దంపతుల కుమార్తెకు పెళ్లి చేశారు.

సొంత ఇంట్లో దంపతులు
మల్లిక, సెల్వం దంపతుల కుమార్తె ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేస్తూ అత్తారింటిలో ఉంటున్నది. సెల్వం, మల్లిక దంపతులు మాత్రమే వారి సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. రాత్రి మల్లిక, సెల్వం దంపతులు భోజనం చేసి ఇంటిబయట బంధువులతో చాలాసేపు మాట్లాడని తెలిసింది.

అర్దరాత్రి భార్యను ఇంటి ముందే నరికేశాడు
అర్దరాత్రి నిద్రలేచిన సెల్వం ఇంటిలో ఉన్న కొడవలి తీసుకుని ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లాడు. తరువాత ఇంట్లో ఉన్న భార్య మల్లికను బయటకు రావాలని సెల్వం పిలిచాడు. ఇంటి బయటకు వచ్చిన భార్య మల్లిక తల మీద కొడవలితో ఇష్టం వచ్చినట్లు దారుణంగా నరికేశాడు. మల్లిక కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి వెళ్లారు.

భర్తకు కొంతకాలంగా ?
అయితే అప్పటికే మల్లిక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసులు అన్నారు. మల్లికను ఆమె భర్త సెల్వం స్పాట్ లో చంపేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఇటీవల సెల్వం మానసిక అస్వస్థతకు గురై పని చెయ్యకుండా ఖాలీగా ఉంటున్నాడు. మల్లిక వ్యవసాయ కూలీగా పని చేస్తోందని స్థానికులు చెప్పారని, సెల్వంను అరెస్టు చేశామని శివగంగై పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications