వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lady: ఆంటీ అంటూనే కామంతో ?, ఎదురు తిరిగిందని చంపేసి సోఫాలో శవం సెట్ చేశాడు, భర్త వెనుకనే !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/పూణే: కొన్ని ప్రాంతాల్లో మహిళల మీద లైంగిక దాడులు ఎప్పుడు ఎలా జరుగుతాయో అంటూ వాళ్ల కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు. చిన్నారులు, పెళ్లికాని అమ్మాయిలు, వివాహిత మహిళలు, ఆంటీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రతిరోజూ మనం ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాము. వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తోంది. పక్కింటిలో నివాసం ఉంటున్న యువకుడు ఆంటీ, అంకుల్ అంటూ వాళ్ల ఇంటికి వెళ్లి వస్తున్నాడు. పక్కింటిలో ఉంటున్న యువకుడు తన భార్యకు ఏదైనా అవసరం అయితే సహాయం చేస్తున్నాడని భర్త అనుకున్నాడు. చాలాకాలం నుంచి పక్కింటిలో నివాసం ఉంటున్న యువకుడు ఆ దంపతుల ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఎప్పటిలాగే భర్త ఉదయం ఉద్యోగానికి వెళ్లాడు. మద్యాహ్నం ఇంటికి వెళ్లి చూసే సరికి ఇంట్లో కొడుకు మాత్రం ఉండటం, భార్య కనపడకపోవడంతో ఆమె కోసం వెతికిన భర్త చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కనపడకుండా పోయిన మహిళ కోసం గాలించారు. సాయంత్రం ఇంట్లో భర్త సోఫా అండ్ బెడ్ చిందరబందరగా ఉండటంతో దానిని సరి చెయ్యడానికి ప్రయత్నించాడు. సోఫా కమ్ బెడ్ లో భార్య శవమై కనిపించడంతో భర్త హడలిపోయి గట్టిగా కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించారు. హత్యకు గురైన మహిళ ఇంటి సమీపంలో పడి ఉన్న చెప్పులు గుర్తించిన ఏసీపీ ఆరా తీశారు. ఆ చెప్పులు పక్కింటి యువకుడివి అని హత్యకు గురైన మహిళ భర్త పోలీసులకు చెప్పాడు. పోలీసుల విచారణలో పక్కింటి యువకుడు దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు చెప్పాడు. నేను ఆంటీ మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించానని, ఆ సమయంలో పెద్ద గొడవ జరిగిందని, చివరికి ఆమెను చంపేసి సోఫా కమ్ బెడ్ లో శవాన్ని నేనే దాచిపెట్టానని చెప్పడంతో అందరూ హడలిపోయారు.

Revenge: ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు. కొడుకు తండ్రి బిగ్ షాట్, నగ్న ఫోటోలతో ?, ఫుట్ బాల్ ఆడేసి !Revenge: ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు. కొడుకు తండ్రి బిగ్ షాట్, నగ్న ఫోటోలతో ?, ఫుట్ బాల్ ఆడేసి !

హ్యాపీగా సంసారం చేసుకుంటున్న మహిళ

హ్యాపీగా సంసారం చేసుకుంటున్న మహిళ

మహారాష్ట్రలోని దోంబివాలిలోని మాంపడ ప్రాంతంలో సుప్రియా కిశోర్ శింధే (35) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం సుప్రియాకు కిశోర్ కు వివాహం జరిగింది. కిశోర్, సుప్రియా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న కిశోర్ అతని భార్య సుప్రియా, ఇద్దరు పిల్లలను బాగా చూసుకుంటూ వారితో సంతోషంగా కాలం గడుపుతున్నాడు.

ఆంటీ అంకుల్ అంటూ ఇంటికి వెళ్లాడు

ఆంటీ అంకుల్ అంటూ ఇంటికి వెళ్లాడు

కిశోర్, సుప్రియా దంపతులు నివాసం ఉంటున్న పక్కింటిలో విశాల్ ఫావత్ అలియాస్ విశాల్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పక్కింటిలో నివాసం ఉంటున్న విశాల్ ఆంటీ, అంకుల్ అంటూ సుప్రియా, కిశోర్ ఇంటికి వెళ్లి వస్తున్నాడు. పక్కింటిలో ఉంటున్న విశాల్ తానను ఇంట్లో లేని సమయంలో తన భార్య సుప్రియాకు ఏదైనా అవసరం అయితే సహాయం చేస్తున్నాడని ఆమె భర్త కిశోర్ అనుకున్నాడు.

ఆంటీ అంటూనే కామంతో చూశాడు

ఆంటీ అంటూనే కామంతో చూశాడు

భర్త కిశోర్ బయటకు వెళ్లిన తరువాత అతని భార్య సుప్రియా ఇంట్లో పిల్లలతో పాటు ఉంటోంది. కిశోర్ బయటకు వెళ్లిన తరువాత పక్కింట్లో నివాసం ఉంటున్న విశాల్ అతని ఇంటికి వెళ్లి సుప్రియాతో మాట్లాడుతూ ఆమెతో ఎక్కువగా కాలం గడిపేవాడని తెలిసింది. వయసులో 17 సంవత్సరాల పెద్దది అయిన సుప్రియాను ఆంటీ అని పిలుస్తూనే ఆమెను కామంతో చూస్తున్న విశాల్ లోలోపల అతని కోరికలు తీర్చుకుంటున్నాడని తెలిసింది. చాలాకాలం నుంచి పక్కింటిలో నివాసం ఉంటున్న విశాల్ పక్కింట్లో ఉంటున్న కిశోర్, సుప్రియా దంపతుల ఇంటికి వెళ్లి వస్తున్నాడు.

 ఉద్యోగానికి వెళ్లిన భర్త

ఉద్యోగానికి వెళ్లిన భర్త

ఎప్పటిలాగే సుప్రియా భర్త కిశోర్ ఉదయం ఉద్యోగానికి వెళ్లాడు. మద్యాహ్నం సుప్రియా కొడుకు ఇంటికి వెళ్లాడు. తరువాత సుప్రియా భర్త కిశోర్ కూడా ఇంటికి వెళ్లి చూసే సరికి ఇంట్లో కొడుకు మాత్రం ఉండటం, భార్య సుప్రియా కనపడకపోవడంతో ఆమె కోసం వెతికిన భర్త చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కనపడకుండా పోయిన సుప్రియా కోసం గాలించారు.

ఇంట్లోనే భార్య శవం చూసి భర్త షాక్

ఇంట్లోనే భార్య శవం చూసి భర్త షాక్

సుప్రియా కోసం ఆమె బంధువులు, స్నేహితులు, పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇంట్లో భర్త సోఫా అండ్ బెడ్ చిందరబందరగా ఉండటంతో దానిని సరి చెయ్యడానికి కిశోర్ ప్రయత్నించాడు. సోఫా కమ్ బెడ్ లో భార్య సుప్రియా శవమై కనిపించడంతో ఆమె భర్త కిశోర్ హడలిపోయి గట్టిగా కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించారు.

 ఇంటి వెనుక విశాల్ చెప్పులు

ఇంటి వెనుక విశాల్ చెప్పులు

హత్యకు గురైన మహిళ సుప్రియా ఇంటి సమీపంలో పడి ఉన్న చెప్పులు గుర్తించిన ఏసీపీ ఆరా తీశారు. ఆ చెప్పులు పక్కింటి యువకుడు విశాల్ వి అని హత్యకు గురైన మహిళ సుప్రియా భర్త కిశోర్ స్థానిక పోలీసులకు చెప్పాడు. పోలీసుల విచారణలో పక్కింటి యువకుడు విశాల్ దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు చెప్పాడు.

ఆంటీ ఎదురు తిరిగింది

ఆంటీ ఎదురు తిరిగింది

పుస్తకం ఇవ్వడానికి నేను సుప్రియా ఆంటీ ఇంటికి వెళ్లానని, ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉందని విశాల్ పోలీసులకు చెప్పాడు. ఒంటరిగా ఉన్న సుప్రియాను తన కోరిక తీర్చాలని చెప్పానని, ఆ సమయంలో నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ వార్నింగ్ ఇచ్చిందని విశాల్ పోలీసులకు చెప్పాడు. తాను సుప్రియాను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె గట్టిగా కేకలు వేస్తానని ఎదురు తిరిగిందని విశాల్ పోలీసులకు మ్యాటర్ చెప్పాడు.

చంపేసి శవాన్ని సోఫా కమ్ బెడ్ లో పెట్టేశాను

చంపేసి శవాన్ని సోఫా కమ్ బెడ్ లో పెట్టేశాను

నేను సుప్రియా ఆంటీ మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించానని, ఆ సమయంలో పెద్ద గొడవ జరిగిందని, చివరికి ఆమెను చంపేశానని విశాల్ అంగీకరించాడు. సుప్రియా శవాన్ని సోఫా కమ్ బెడ్ లో నేనే దాచిపెట్టానని చెప్పడంతో ఆమె భర్త కిశోర్ తో పాటు పోలీసులు, స్థానికులు అందరూ హడలిపోయారు.

 చంపేసి కేసు పెట్టడానికి వెళ్లాడు

చంపేసి కేసు పెట్టడానికి వెళ్లాడు


సుప్రియా కనపడటం లేదని కిశోర్ పక్కింటి వాళ్లకు చెప్పాడు. ఆ సమయంలో కిశోర్ తో పాటు సుప్రియాను వెతకడానికి అతని వెంట విశాల్ వెళ్లాడని పోలీసులు అన్నారు. సుప్రియా కోసం ఆమె భర్త కిశోర్ తో కలిసి వెతికినట్లు నటించిన విశాల్ చివరికి భర్త కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో అతని వెంటకూడా విశాల్ ఉన్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. సుప్రియాను హత్య చేసిన విశాల్ అమె భర్త కిశోర్ వెంటే ఉంటూ అనుమానం రాకుండా నటించి కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడని, చివరికి అతను వేసుకునే చెప్పుల చిక్కడంతో అతను కూడా చిక్కిపోయాడని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Lady: Missing womans body found inside sofa in Dombivli flat in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X