వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lady: పాత బాయ్ ఫ్రెండ్, మెక్సికోలో ఉద్యోగం, ముంబాయి లేడీకి ఏం చేశాడంటే ?. మాయలోడు!

|
Google Oneindia TeluguNews

ముంబాయి: కొన్ని సంవత్సరాల క్రితం యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. ఆ సమయంలో యువకుడు ఎయిర్ పోర్టులో, యువతి మరో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేది. తరువాత మూడు సంవత్సరాలు ఇద్దరు టచ్ లో లేరు. మూడు సంవత్సరాల తరువాత యువతి పుట్టిన రోజు సందర్బంగా ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. అప్పటి నుంచి ఆ యువకుడు యువతితో టచ్ లో ఉన్నాడు. తరువాత యువకుడు విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగంలో చేరాడు. యువతి మాత్రం ఆర్థిక రాజధానిలోనే ఉంటూ ఉద్యోగం చేస్తున్నది.

యువతికి ఫోన్ చేసిన యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పాడు. నిన్ను విదేశాలకు పిలిపించుకుంటానని, నేను ఉద్యోగం చేస్తున్న చోట నీకు ఉద్యోగం ఇప్పిస్తానని, ఇక్కడే సంతోషంగా ఉండవచ్చని చెప్పాడు. స్నేహితుడి మాయమాటలు నమ్మిన యువతి అతనికి కొన్ని లక్షల రూపాయలు సమర్పించుకుంది. అంతే ఆ యువకుడు ఆమెను పంగనామాలు పెట్టి తప్పించుకుని ఎస్కేప్ అయ్యాడు.

Aunty: పండుగకు పిలిచిన అత్తతో బూతులు మాట్లాడిన అల్లుడు, కొడవలితో నరికి చంపేసిన మామ, కూతురు!Aunty: పండుగకు పిలిచిన అత్తతో బూతులు మాట్లాడిన అల్లుడు, కొడవలితో నరికి చంపేసిన మామ, కూతురు!

10 ఏళ్ల క్రితం పరిచయం

10 ఏళ్ల క్రితం పరిచయం

ముంబాయిలోని ఓ ప్రైవేట్ సంస్థలో 2012లో 32 ఏళ్ల మనీషా (పేరు మార్చడం జరిగింది) ఉద్యోగం చేసేది. ఆ సమయంలో నితిన్ సాబుల్ అనే యువకుడు మనీషాకు పరిచయం అయ్యాడు. ఆ సమయంలో నితిన్ సాబూల్ ముంబాయి ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేసేవాడు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మనీషాకు నితిన్ దగ్గర అయ్యాడు. తరువాత మూడు సంవత్సరాలు మనీషా, నితిన్ సాబూల్ టచ్ లో లేరు.

బర్త్ డే రోజు టచ్ లోకి వచ్చాడు

బర్త్ డే రోజు టచ్ లోకి వచ్చాడు

2017లో మనీషాకు పుట్టిన రోజు సందర్బంగా నితిన్ సాబుల్ ఆమెకు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. అప్పటి నుంచి నితిన్ సాబుల్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మనీషాతో టచ్ లో ఉన్నాడు. తరువాత నితిన్ సాబుల్ మెక్సికో వెళ్లిపోయి విదేశాలకు చెందిన జ్యువెలర్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.

మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు

మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు

ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం మానేసిన మనీషా ముంబాయిలోని ప్రముఖ కార్ల షోరూమ్ లో అడ్మిన్ మేనేజర్ గా ఉద్యోగంలో చేరింది. తరువాత మళ్లీ నితిన్ సాబుల్ ముంబాయిలో ఉద్యోగం చేస్తున్న మనీషాకు టచ్ లోకి వచ్చాడు. తనకు కూడా మెక్సికోలో ఏదైనా ఉద్యోగం ఉంటే చూడాలని మనీషా ఆమె స్నేహితుడు నితిన్ సాబుల్ కు చెప్పింది.

రూ. 2 లక్షలు స్వాహా

రూ. 2 లక్షలు స్వాహా

మనీషాకు ఫోన్ చేసిన నితిన్ సాబుల్ నీకు మెక్సికోలోని జ్యువెలరీస్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటీవ్ గా ఉద్యోగం ఇప్పిస్తానని, పాస్ పోర్టు క్లియరెన్స్, వీసా తదితర వెరిఫికేషన్ కోసం రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందని ఆమెకు మాయమాటలు చెప్పాడు. నిన్ను విదేశాలకు పిలిపించుకుంటానని, నేను ఉద్యోగం చేస్తున్న చోట నీకు ఉద్యోగం ఇప్పిస్తానని, ఇక్కడే సంతోషంగా ఉండవచ్చని నితిన్ సాబుల్ అతని స్నేహితురాలు మనీషాకు చెప్పాడు. స్నేహితుడి మాయమాటలు నమ్మిన మనీషా 2021 లో రూ. 2 లక్షల రూపాయలు నితిన్ సాబుల్ కు సమర్పించుకుంది. మొదట రూ. 8 లక్షలు మాట్లాడుకుంటే మొదట రూ. 2 లక్షలు ఇచ్చింది.

లేడీని ఢిల్లీకి పంపించి జంప్

లేడీని ఢిల్లీకి పంపించి జంప్

నువ్వు ఢిల్లీలోని మెక్సికో రాయభార కార్యాలయానికి వెళ్లి వీసా వెరిఫికేషన్ పత్రాల మీద సంతకాలు చెయ్యాలని మనీషాకు మాయగాడు నితిన్ సాబుల్ చెప్పాడు. ఢిల్లీకి వెళ్లిన మనీషా మెక్సికో రాయబార కార్యాలయంలోని అధికారులను సంప్రధించింది. మీకు మెక్సికోలోని జ్యువెలరీస్ కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లు ఎలాంటి ప్రతిపాధనలు లేవని, మిమ్మల్ని ఎవరో మోసం చేశారని చెప్పారు. తరువాత నితిన్ సాబుల్ కు ఫోన్ చెయ్యడంతో అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది.

మోసం జరిగిందని లేటుగా తెలుసుకున్న లేడీ

మోసం జరిగిందని లేటుగా తెలుసుకున్న లేడీ

మోసపోయానని గ్రహించిన మనీషా రెండు రోజుల క్రితం ముంబాయిలోని అధేరి పోలీస్ స్టేషన్ లో నితిన్ సాబుల్ మీద కేసు పెట్టిందని పోలీసు అధికారులు శనివారం తెలిపారు. కేటుగాడు నితిన్ సాబుల్ పాత మొబైల్ ఫోన్ నెంబర్ ఆధారంగా కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Lady: A Mumbai woman was cheated of Rs 2 lakh on the pretext of providing a sales executive job in Mexico. The 32-year-old victim worked in a car showroom as assistant administrator.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X