హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady: రౌడీఇన్స్ పెక్టర్, పీకలదాక తాగి హోటల్ లో లేడీతో ఏం చేశాడంటే ?, మైండ్ బ్లాక్, వేటువేసిన ప్రతాప్ రెడ్డి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ లో పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్న ఇన్స్ పెక్టర్ వేరే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్లాడు. ఫ్రెండ్స్ తో కలిసి పీకలదాక మద్యం సేవించిన ఇన్స్ పెక్టర్ తరువాత ఓ హోటల్ లోకి వెళ్లాడు. ఆ ఫేమస్ హోటల్ లో రిసెప్షనిస్ట్ గా ఓ మహిళ ఉద్యోగం చేస్తోంది. హోటల్ లోకి వెళ్లిన ఇన్స్ పెక్టర్ తనకు రూమ్ కావాలని చెప్పాడు. ఆ సందర్బంలో మహిళతో కొంతసేపు మాట్లాడిన ఇన్స్ పెక్టర్ తరువాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. కొంతసేపు మహిళ, ఇన్స్ పెక్టర్ మద్య రాద్దాంతం జరిగింది. నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ రౌడీఇన్స్ పెక్టర్ మీద కేసు పెట్టింది. గతంలో కూడా అయ్యగారు మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ కు వెళ్లి డ్యూటీ చెయ్యడం, ఫోక్సో, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు హోటల్ లో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్స్ పెక్టర్ మీద సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి వేటు వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: భర్త ఫ్రెండ్ తో ఆంటీ రొమాన్స్, కూతురికి పెళ్లి చేసింది, భార్య రసపట్టులో ఉంటే భర్త ఎంట్రీతో !Illegal affair: భర్త ఫ్రెండ్ తో ఆంటీ రొమాన్స్, కూతురికి పెళ్లి చేసింది, భార్య రసపట్టులో ఉంటే భర్త ఎంట్రీతో !

కేపీ అగ్రహార ఇన్స్ పెక్టర్

కేపీ అగ్రహార ఇన్స్ పెక్టర్

బెంగళూరు నగరంలోని కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్ లో గోపాల్ క్రిష్ణ గౌడ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. పోలీస్ ఇన్స్ పెక్టర్ గోపాల్ క్రిష్ణ గౌడ మీద ఇప్పటికే ఆనేక ఆరోపణలు ఉన్నాయి. వివాదాలకు కేంద్రబింధువు అయిన గోపాల్ క్రిష్ణ గౌడ బెంగళూరులోని జీవన్ భీమా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి స్నేహితులతో కలిసి వెళ్లాడు.

పీకలదాక లిక్కర్ తాగేసి హోటల్ లోకి వెళ్లిన సీఐ

పీకలదాక లిక్కర్ తాగేసి హోటల్ లోకి వెళ్లిన సీఐ

ఫ్రెండ్స్ తో కలిసి పీకలదాక మద్యం సేవించిన పోలీస్ ఇన్స్ పెక్టర్ గోపాల్ క్రిష్ణ గౌడ తరువాత జీవన్ భీమానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫేమస్ హోటల్ లోకి వెళ్లాడు. ఆ ఫేమస్ హోటల్ లో రిసెప్షనిస్ట్ గా ఓ మహిళ ఉద్యోగం చేస్తోంది. హోటల్ లోకి వెళ్లిన ఇన్స్ పెక్టర్ గోపాల్ క్రిష్ణ గౌడ తనకు రూమ్ కావాలని ఆమెకు చెప్పాడు.

సార్ మీద కేసు పెట్టిన లేడీ

సార్ మీద కేసు పెట్టిన లేడీ

ఆ సందర్బంలో మహిళతో కొంతసేపు మాట్లాడిన ఇన్స్ పెక్టర్ గోపాల్ క్రిష్ణ గౌడ తరువాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. కొంతసేపు మహిళ, ఇన్స్ పెక్టర్ గోపాల్ క్రిష్ణ గౌడల మద్య రాద్దాంతం జరిగింది. ఆ సమయంలో విసిగిపోయిన మహిళ నేరుగా జీవన్ భీమానగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్ రౌడీఇన్స్ పెక్టర్ గోపాల్ క్రిష్ణ గౌడ మీద అసభ్యంగా ప్రవర్తించాడని కేసు పెట్టింది.

మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ లో డ్యూటీ

మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ లో డ్యూటీ

ఇన్స్ పెక్టర్ గోపాల్ క్రిష్ణ గౌడ మీద కేసు నమోదు చేసిన జీవన్ భీమానగర్ పోలీసులు డీసీపీ, బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. గతంలో కూడా ఇన్స్ పెక్టర్ గోపాల్ క్రిష్ణ గౌడ మద్యం మత్తులో కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్ కు వెళ్లి డ్యూటీ చేస్తున్నాడని చాలాసార్లు ఆరోపణలు వచ్చాయని అధికారులు అంటున్నారు.

 ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేసిన ప్రతాప్ రెడ్డి

ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేసిన ప్రతాప్ రెడ్డి

గతంలో అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్సడ్డారని ఆరోపణలు రావడంతో ఆ సందర్బంలోనే డీసీపీ రౌడీఇన్స్ పెక్టర్ కు వార్నింగ్ ఇచ్చారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. హోటల్ లో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్స్ పెక్టర్ గోపాల్ క్రిష్ణను సస్పెండ్ చేస్తూ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డి ఆదేశాలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఇన్స్ పెక్టర్ గోపాల్ క్రిష్ణ గౌడ మీద కేసు నమోదు చేసిన జీవన్ భీమా నగర్ పోలీసులు మహిళ నుంచి సమాచారం సేకరించి విచారణ చేస్తున్నారు.

English summary
Lady: Police Inspector suspended for misbehave with woman in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X