Lady: ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు, చెల్లెలి భర్త రెండో భార్యను ఏం చేశాడంటే ?, నగ్నంగా చేసి బావిలో !

చెన్నై/ సేలం: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేశాడు. మొదటి భార్యకు పిల్లలు పుట్టరని తెలిసిన తరువాత అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు ఓ కొడుకు పుట్టాడు. ఇద్దరి భార్యలతో కాపురం చేస్తున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం అతని చెల్లిని వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇద్దరు భార్యలతో సంతోషంగా కాపురం చేస్తున్న వ్యక్తి అతని 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేయిస్తున్నాడు. ఇటీవల ఆ వ్యక్తి అతని ఇద్దరు భార్యలతో పాటు కొడుకు పేరుతో ఆస్తిలోని 7 ఎకరాల పొలం రాసిచ్చేశాడు. ఈ వియంలో చెల్లెలి భర్తతో ఇద్దరు భార్యల ముద్దుల మొగుడికి గొడవ జరిగింది. పెద్దలు సర్దిచెప్పడంతో ఆ సమయంలో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన రెండో భార్య రెండు రోజులు అయినా కనపడటం లేదని భర్త పోలీసు కేసు పెట్టారు. రెండు రోజుల తరువాత రెండో భార్య బావిలో నగ్నంగా శవమై కనిపించింది. రెండో భార్య శరీరం మీద నూలుపోగుకూడా లేకుండా శవమై కనిపించడంతో అతను హడలిపోయాడు. ఇదే కేసులో బావ రెండో భార్య హత్య కేసులో అతని చెల్లెలి భర్త పోలీసుల ముందు లొంగిపోయి ఆమెను తానే హత్య చేశానని చెప్పడం కలకలం రేపింది.

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు


తమిళనాడులోని సేలం జిల్లాలోని వీరకనూరు సమీపంలోని పకడప్పాడి ప్రాంతంలో అశోకన్ (43) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 సంవత్సరాల క్రితం విజయ (39) అనే మహిళను అశోక్ పెళ్లి చేసుకున్నాడు. విజయను వివాహం చేసుకున్న అశోకన్ అతని భార్యతో కాపురం చేశాడు. మొదటి భార్య విజయకు పిల్లలు పుట్టరని తెలిసిన తరువాత 16 ఏళ్ల క్రితం అశోకన్ సెల్వరాణి (35) అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.

 చెల్లెలికి పెళ్లి చేశాడు

చెల్లెలికి పెళ్లి చేశాడు

రెండో భార్య సెల్వరాణికి 15 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇద్దరు భార్యలు విజయ, సెల్వరాణితో కాపురం చేస్తున్న అశోకన్ కొన్ని సంవత్సరాల క్రితం అతని చెల్లిని శివరాజ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇద్దరు భార్యలు విజయ, సెల్వరాణితో సంతోషంగా కాపురం చేస్తున్న వ్యక్తి అతని 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేయిస్తున్నాడు.

ఇద్దరు భార్యలు, కొడుక్కి ఆస్తి రాసిచ్చిన భర్త

ఇద్దరు భార్యలు, కొడుక్కి ఆస్తి రాసిచ్చిన భర్త

ఇటీవల అశోకన్ అతని ఇద్దరు భార్యలు విజయ, సెల్వరాణితో పాటు కొడుకు పేరుతో ఆస్తిలోని 7 ఎకరాల పొలం రాసిచ్చేశాడు. ఈ వియంలో చెల్లెలి భర్త శివరాజ్ తో ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు అశోకన్ కు గొడవ జరిగింది. నా భార్యకు పుట్టింటి నుంచి రావలసిన వాటా ఇచ్చేయాలని శివరాజ్ అతని బావ అశోకన్ తో గొడవ పెట్టుకున్నాడు. పెద్దలు సర్దిచెప్పడంతో ఆ సమయంలో అశోకన్, అతని చెల్లెలి భర్త శివరాజ్ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు.

బావిలో శవమైన రెండో భార్య

బావిలో శవమైన రెండో భార్య

ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన రెండో భార్య సెల్వరాణి రెండు రోజులు అయినా కనపడటం లేదని అశోకన్ పోలీసు కేసు పెట్టారు. రెండు రోజుల తరువాత అశోకన్ రెండో భార్య సెల్వరాణి ఊరి బయట బావిలో నగ్నంగా శవమై కనిపించింది. రెండో భార్య సెల్వరాణి శరీరం మీద నూలుపోగుకూడా లేకుండా శవమై కనిపించడంతో అశోకన్ హడలిపోయాడు.

నేనే చంపేశానని లొంగిపోయిన బావమరిది

నేనే చంపేశానని లొంగిపోయిన బావమరిది

ఇదే కేసులో అశోకన్ రెండో భార్య సెల్వరాణి హత్య కేసులో అతని చెల్లెలి భర్త శివరాజ్ పోలీసుల ముందు లొంగిపోయి ఆమెను తానే హత్య చేశానని చెప్పడం కలకలం రేపింది. ఆస్తి విషయంలో రాజీ చేస్తానని సెల్వరాణి చెప్పిందని అయితే ఆమె కూడా తనను మోసం చెయ్యడంతో ఆమెను చంపేశానని శివరాజ్ చెప్పాడు. కేసు తన మీదకు రాకుండా ఉండాలని సెల్వరాణి చీర, జాకెట్ పూర్తిగా విప్పేసి శరీరం మీద గాయాలు చేసి ఎవరో రేప్ చేసి చంపేశారని అనుకోవాలని కాళ్లకు రాళ్లు కట్టి బావిలో విసిరేశానని శివరాజ్ పోలీసుల ముందు నేరంగా అంగీకరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+