చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady: గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం, ఓనర్ పర్సనల్ లేడీస్ ను గోకిన ఉద్యోగి, క్లైమాక్స్ లో రివర్స్, సీసీటీవీల

|
Google Oneindia TeluguNews

చెన్నై/ తిరువూర్: సొంతంగా వ్యాపారం చెయ్యాలని అనుకున్న వ్యక్తి గార్మెంట్స్ ఫ్యాక్టరీ పెట్టాడు. మహిళలు, యువకులు బనియన్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు. ఎక్కువగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ సొంత ఊరికి చెందిన యువకుడు అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న మహిళలు ఉద్యోగం మానేస్తూ వచ్చారు. ఓనర్ తో సన్నిహితంగా ఉన్న ఇద్దరు మహిళలు ఉద్యోగం మానేశారు. ఇటీవల గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న యువకుడు దారుణ హత్యకు గురైనాడు. యువకుడి హత్య కేసులో గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ తో పాటు అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. మహిళల విషయంలోనే యువకుడు హత్యకు గురైనాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: ఆంటీ మీద అంకుల్ కు అనుమానం, ఆవేశంతో గొడ్డలితో నరికి చంపేసి !Illegal affair: ఆంటీ మీద అంకుల్ కు అనుమానం, ఆవేశంతో గొడ్డలితో నరికి చంపేసి !

 గార్మెంట్స్ కంపెనీ ఓనర్

గార్మెంట్స్ కంపెనీ ఓనర్

తమిళనాడులోని మైలాడుతురైకి చెందిన అజిత్ అనే వ్యక్తి సొంతంగా వ్యాపారం చెయ్యాలని అనుకున్నాడు. తిరువూర్ లోని రాధానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో కొన్ని సంవత్సరాల క్రితం అజిత్ సొంతంగా గార్మెంట్స్ ఫ్యాక్టరీ పెట్టాడు. మహిళలు, యువకులు అజిత్ బనియన్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేస్తున్నారు.

సూపర్ వైజర్ ఉద్యోగం..... పక్కలో లేడీస్

సూపర్ వైజర్ ఉద్యోగం..... పక్కలో లేడీస్

గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ అజిత్ సొంత ఊరు మైలాడుతురైకి చెందిన ఆకాష్ (24) అనే యువకుడు అదే గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంత ఊరు మనిషి అని అజిత్ అతని దగ్గర పని చేస్తున్న ఆకాష్ కు ఓ బైక్ కూడా తీసిచ్చాడు. ఆకాష్ అదే కంపెనీలో సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా ఆకాష్ మంచిగానే గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేశాడు.

ఓనర్ కు క్లోజ్ గా ఉండే లేడీస్ ను ఏం చేశాడంటే ?

ఓనర్ కు క్లోజ్ గా ఉండే లేడీస్ ను ఏం చేశాడంటే ?


కొంతకాలంగా అజిత్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న మహిళలు ఉద్యోగం మానేస్తూ వచ్చారు. గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ అజిత్ తో సన్నిహితంగా ఉన్న ఇద్దరు మహిళలు ఉద్యోగం మానేశారు. ఎందుకు మహిళలు ఉద్యోగాలు మానేస్తున్నారు అని అజిత్ అతనితో సన్నిహితంగా ఉంటున్న మహిళల దగ్గర ఆరా తీశాడు.

లేడీస్ కు అకాష్ టార్చర్ ఎక్కువ అయ్యింది

లేడీస్ కు అకాష్ టార్చర్ ఎక్కువ అయ్యింది


గార్మెంట్స్ ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్న ఆకాష్ ఆ కంపెనీ ఓనర్ తన సొంత ఊరు మనిషి అని రెచ్చిపోయాడని అజిత్ తెలుసుకున్నాడు. ఓనర్ అజిత్ ను అడ్డం పెట్టుకున్న ఆకాష్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న మహిళలను లైంగిక వేధింపులకు గురి చేశాడని, అందుకే వాళ్లు ఉద్యోగాలు మానేస్తున్నారని అజిత్ తెలుసుకున్నాడు.

పక్కాప్లాన్ తో పిలిపించి ?

పక్కాప్లాన్ తో పిలిపించి ?

గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ అజిత్ కు మండిపోయి ఆరు నెలల క్రితం ఆకాష్ ను ఉద్యోగంలో నుంచి తీసేశాడు. ఉద్యోగం తీసేయడంతో ఓనర్ తీసిచ్చిన బైక్ తో ఆకాష్ వేరేఊరికి వెళ్లిపోయాడు. ఆరు నెలల నుంచి ఆకాష్ కు ఫోన్లు చేస్తున్న అజిత్ తన బైక్ తెచ్చి ఇవ్వాలని చెప్పాడు. బైక్ తీసుకు వచ్చిన ఆకాష్ మీద రగిలిపోయిన అజిత్ అతన్ని చితకబాదేశారు.

లిక్కర్ పార్టీ...... ఆకాష్ ను చంపేసి చెరువులో శవం వేశారు

లిక్కర్ పార్టీ...... ఆకాష్ ను చంపేసి చెరువులో శవం వేశారు

అజిత్ అతని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్, మరో వ్యక్తితో కలిసి ఈనెల 11వ తేదీన ఆకాష్ ను చితకబాదేశారు. అదే రోజు ఆకాష్ కు లిక్కర్ పార్టీ ఇచ్చే ముసుగులో తిరువూరు జిల్లాలోని కన్నత్తూరు సమీపంలోని చెరువు దగ్గరకు పిలుచుకుని వెళ్లారు, తరువాత అకాష్ ను హత్య చేసి అతని శవాన్ని చెరువులో విసిరేశారు. నాలుగు రోజుల తరువాత ఆకాష్ శవం గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు.

 సీసీటీవీల దెబ్బతో చిక్కిపోయిన ఓనర్

సీసీటీవీల దెబ్బతో చిక్కిపోయిన ఓనర్


చెరువు చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఓనర్ అజిత్, కార్తీక్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. గార్మెంట్స్ ఫ్యాక్టరీలో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసినందుకే ఆకాష్ ను హత్య చేశామని ఆ కంపెనీ ఓనర్ అజిత్ నేరం అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Lady: Sexval harassment, youth murder case police arrest garments company owner in Tiruppur in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X