lady singer: మంత్రి రేప్ కేసులో ట్విస్ట్, మసాజ్ చేస్తానని ముంచేసింది, సింగర్ తో కాదు వాళ్ల అక్కతో లింక్ !

ముంబాయి/ బెంగళూరు/ హైదరాబాద్: బాలీవుడ్ లో తనకు అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించిన మంత్రి అతనికి ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు వచ్చి రేప్ చేశాడని లేడీ సింగర్ కేసు పెట్టడంతో ఆ మంత్రితో పాటు ఆయన పార్టీకి చెందిన నాయకులకు చెమటలుపట్టాయి. నాకు లేడీ సింగర్ తో కాదు వాళ్ల అక్కతో లింక్ ఉందని మంత్రి బాంబు పేల్చాడు. మంత్రి రేప్ కేసు విచారణ చేస్తున్న పోలీసుల ముందుకు మరో కేసు వెళ్లింది. మసాజ్ చేస్తానని తన వెంటపడి తనతో అక్రమ సంబంధం పెట్టుకోలని 2010 నుంచి లేడీ సింగర్ టార్చర్ పెడుతోందని, మీరే నాకు న్యాయం చెయ్యాలని బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం రాజకీయ వర్గాల్లో, బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. మంత్రి మీద లేడీ సింగర్ కేసు పెట్టడం, మంత్రి మీద రేప్ కేసు పెట్టిన లేడీ సింగర్ మీద మరో ప్రముఖ లీడర్ కేసు పెట్టడంతో కథ రసవత్తరంగా మారింది.

 మంత్రి మీద రేప్ కేసు

మంత్రి మీద రేప్ కేసు

మహారాష్ట్ర మంత్రి, ఎన్ సీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ధనంజయ్ ముండే తన మీద రేప్ చేశాడని బాలీవుడ్ సింగర్ రేణు (38) అనే మహిళ ముంబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించిన మంత్రి ధనంజయ్ ముండే ఆయనకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు వచ్చి తన మీద రేప్ చేశాడని ఆరోపిస్తూ మంగళవారం (జనవరి 13వ తేదీ) సింగర్ రేణు ముంబాయిలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టంది.

 మంత్రి పదవి పీకేయాలని సీఎంకు మనవి

మంత్రి పదవి పీకేయాలని సీఎంకు మనవి

రెండు రోజుల క్రితం సింగర్ రేణు మంత్రి ధనంజయ్ ముండే మీద రేప్ కేసు పెట్టడంతో ఆయన్ను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేని ప్రతిపక్షాలు, బీజేపీ మహిళా మోర్చ నాయకులు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో తనకు న్యాయం చెయ్యాలని లేడీ సింగర్ రేణు కూడా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకి మనవి చేసింది.

 సింగర్ తో కాదు వాళ్ల అక్కతో లింక్ ఉంది: మంత్రి

సింగర్ తో కాదు వాళ్ల అక్కతో లింక్ ఉంది: మంత్రి

లేడీ సింగర్ రేణు అక్కకు తనకు సంబంధం ఉందని, తరువాత రేణు కూడా తనతో సంబంధం పెట్టుకుంది, ఆ విషయాలు అడ్డం పెట్టుకుని తనకు భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని గత నవంబర్ నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని మంత్రి ధనంజయ్ ముండే చెబుతున్నారు. మంత్రి ధనంజయ్ ముండే మీద రేప్ కేసు నమోదు కావడం, ఓ సింగర్ ఆరోపణలు చెయ్యడంతో ఎన్సీపీ నేత శరద్ పవార్ సైతం మంత్రి మీద సీరియస్ అయ్యారని తెలిసింది.

 మసాజ్ చేస్తానని సింగర్ నా కొంప ముంచింది

మసాజ్ చేస్తానని సింగర్ నా కొంప ముంచింది

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే మీద లేడీ సింగ్ రేప్ కేసు పెట్టడంతో మహారాష్ట్రలో రాజకీయంగా దూమరం లేపింది. ఇదే సమయంలో బీజేపీ నేత కృష్ణ హెగ్డే లేడీ సింగర్ రేణు మీద కేసు పెట్టారు. మసాజ్ చేస్తానని తన వెంటపడి తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని లేడీ సింగర్ రేణు తనను టార్చర్ చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నేత కృష్ణ హెగ్డే ముంబాయిలోని ఆంచోలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.

 కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి

కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి

అధికారంలో ఉన్న మంత్రి ధనంజయ్ ముండే మీద లేడీ సింగర్ రేణు రేప్ కేసు పెట్టడంతో మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఇదే సమయంలో మంత్రి రాజీనామా చెయ్యాలని బీజేపీ మహిళా మోర్చ డిమాండ్ చేస్తున్న సమయంలో అదే బీజేపీ నేత కృష్ణ హెగ్డే అదే లేడి సింగర్ మీద మరో కేసు పెట్టడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఇంకా లేడీ సింగర్ రేణు వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికి వెలుతుందో వేచి చూడాలి అంటున్నారు ముంబాయి పోలీసులు. మంత్రి ధనంజయ్ ముండే మీద రేప్ కేసు నమోదు కావడం, ఓ సింగర్ ఆరోపణలు చెయ్యడంతో ఎన్సీపీ నేత శరద్ పవార్ సైతం మంత్రి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై ఎన్ సీపీ నేతలతో చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+