Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: మహిళా ఉద్యోగికి జీతం పెంచిన సూపర్ వైజర్, సార్ మీరు ఆమెతో బాగా సుఖపడుతున్నారు కదా ?, ఫినిష్ !

బెంగళూరు: ఒకే చోట పని చేస్తున్న వ్యక్తులు కలిసి మెలసి వారి పని వారు చేసుకుంటూ వెలుతున్నారు. ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగుల పనితీరు పరిశీలించి వారికి ఎంతెంత జీతాలు పెంచాలి అని విషయం నిర్ణయించే బాధ్యతలను సూపర్ వైజర్ కు అప్పగించారు. ఉద్యోగుల పనితీరు పరిశీలించిన సూపర్ వైజర్ ఉద్యోగులకు ఎంతెంత జీతాలు ఇవ్వాలనే విషయం లిస్ట్ రెడీ చేసి యజమానికి ఇచ్చేశారు. దీపావళి పండుగ సందర్బంగా ఆ సంస్థ యజమానులు ఉద్యోగుల జీతాలు పెంచి (హైక్) వారి జీతాలతో పాటు బోనస్ ఇచ్చారు. ఇదే సమయంలో సూపర్ వైజర్ తో ఎక్కువ చనువుగా ఉంటున్న మహిళకు ఎక్కువ మొత్తంలో జీతం పెంచారు. ఇదే విషయంలో ఓ ఉద్యోగి సూపర్ వైజర్ మీద రగిలిపోయాడు. సూపర్ వైజర్ తో కలిసి మద్యం సేవించే సమయంలో వాట్ సార్, నీ ఫిగర్ కు జీతం బాగా పెంచినట్లు ఉన్నావు, అంటే ఆమెతో నువ్వు బాగా సుఖపడుతున్నావన్నమాటా ? అంటూ ఎగతాలిగా ఉన్నాడు. మద్యం మత్తులో ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. మహిళ విషయంలో మాటామాటా పెరిగిపోవడంతో ఒకరు సహనం కోల్పోయి మరో వ్యక్తి హత్యకు గురి కావడం ఆ సంస్థలో కలకలం రేపింది.

 మాల్గూడి ఫామ్స్ లో ఉద్యోగాలు

మాల్గూడి ఫామ్స్ లో ఉద్యోగాలు

ఐటీ హబ్ బెంగళూరు సిటీలోని కామాక్షిపాళ్య సమీపంలోని కొట్టిగేపాళ్యలోని మాల్గుడి ఫామ్స్ లో చాలా మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మాల్గూడి ఫామ్స్ చాలా ఫేమస్. మాల్గూడి ఫామ్స్ లో కేశవ్ (40) అనే వ్యక్తి సూపర్ వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మాల్గూడి ఫామ్స్ లో పని చేస్తున్నవాళ్లు అందరూ కలిసి మెలసి వారి పని వారు చేసుకుంటూ వెలుతున్నారు.

 జీతాలు పెంచే బాధ్యత సూపర్ వైజర్ దే

జీతాలు పెంచే బాధ్యత సూపర్ వైజర్ దే

మాల్గూడి ఫామ్స్ లో ఉద్యోగం చేస్తున్న వారి పనితీరు పరిశీలించి వారికి ఎంతెంత జీతాలు పెంచాలి అని విషయం నిర్ణయించే బాధ్యతలను ఆ సంస్థ యజమానులు సూపర్ వైజర్ కేశవ్ కు అప్పగించారు. ఉద్యోగుల పనితీరు పరిశీలించిన సూపర్ వైజర్ కేశవ్ ఉద్యోగులకు ఎంతెంత జీతాలు ఇవ్వాలనే విషయం లిస్ట్ రెడీ చేసి యజమానులకు ఇచ్చేశాడు.

 ఓ మహిళకు జీతం బాగా పెరిగిపోయింది

ఓ మహిళకు జీతం బాగా పెరిగిపోయింది

మాల్గూడి ఫామ్స్ లో శివన్న అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. దీపావళి పండుగ సందర్బంగా మాల్గూడి ఫామ్స్ సంస్థ యజమానులు ఉద్యోగుల జీతాలు పెంచి (హైక్) వారి జీతాలతో పాటు బోనస్ ఇచ్చారు. ఇదే సమయంలో సూపర్ వైజర్ కేశవ్ తో ఎక్కువ చనువుగా ఉంటున్న మహిళకు ఎక్కువ మొత్తంలో జీతం పెంచారు. ఇదే విషయంలో సాటి ఉద్యోగి శివన్న సూపర్ వైజర్ కేశవ్ మీద రగిలిపోయాడు.

 మందు పార్టీలో వాగ్వివాదం

మందు పార్టీలో వాగ్వివాదం

సూపర్ వైజర్ కేశవ్ తో కలిసి మద్యం సేవించే సమయంలో శివన్న రెచ్చిపోయాడు. ఏమి కేశవ్ సార్, నీ ఫిగర్ కు జీతం బాగా పెంచినట్లు ఉన్నావు, అంటే ఆమెతో నువ్వు బాగా సుఖపడుతున్నావన్నమాటా ? అంటూ ఎగతాలిగా ఉన్నాడు. అదంతా ఏమీలేదు, పనితీరును బట్టి నేను జీతాలు ఎంత ఇవ్వాలని అనే విషయం యజమానికి చెప్పానని, జీతాలు తాను పెంచలేదని కేశవ్ ఆ సమయంలో శివన్నకు చెప్పాడు.

Recommended Video

    Sonu Sood Meets Crowd Of People Hoping For Help At Outside Of His House | Oneindia Telugu
     కత్తితో పొడిచి సూపర్ వైజర్ ను చంపేసిన ఉద్యోగి

    కత్తితో పొడిచి సూపర్ వైజర్ ను చంపేసిన ఉద్యోగి

    మద్యం మత్తులో కేశవ్, శివన్నల మద్య వాగ్వివాదం జరిగింది. మహిళ విషయంలో మాటామాటా పెరిగిపోవడంతో శివన్న సహనం కోల్పోయి కత్తి తీసుకుని సూపర్ వైజర్ కేశవన్ ను పొడిచి దారుణంగా హత్య చెయ్యడం మాల్గూడి ఫామ్స్ లో కలకలం రేపింది. సూపర్ వైజర్ కేశవ్ ను హత్య చేసిన శివన్న అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న కామాక్షిపాళ్య పోలీసులు శివన్నను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+