Lady: ఫేమస్ ఆడియో కంపెనీ ఎండీ మీద రేప్ కేసు, ఆ రోజు మిస్, ఇప్పుడు పక్కాసాక్షాలు ?
ముంబాయి/చెన్నై: దేశంలోనే ప్రముఖ ఆడియో కంపెనీ ఎండీ మీద రేప్ కేసు నమోదు కావడం కలకలం రేపింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన మీద మూడు సంవత్సరాల్లో అనేక సార్లు రేప్ చేశారని యువతి ఆడియో కంపెనీ ఎండీ, ప్రముఖ నిర్మాత మీద కేసు పెట్టింది. దేశంలోనే ప్రముఖ ఆడియో కంపెనీ యజమాని మీద రేప్ కేసు నమోదు కావడం దూమరం రేపింది. గతంలో కూడా ఈ నిర్మాత మీద లైంగిక వేదింపుల ఆరోపణలు వచ్చినా అప్పట్లో కేసు నమోదు కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆడియో కంపెనీ ఎండీ మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది.

దేశంలోనే ఫేమస్ ఆడియో సంస్థ
బాలీవుడ్ లో టీ-సిరీస్ ఆడియో సంస్థ ఎంతో ఫేమస్ అనే విషయం సినీ ప్రేమికులు అందరికి తెలుసు. గుల్షన్ కుమార్ టీ-సిరీస్ ఆడియో సంస్థను స్థాపించారు. గుల్షన్ కుమార్ మరణించిన తరువాత ఆయన కుమారుడు భూషణ్ కుమార్ టీ సిరీస్ ఆడియో సంస్థ ఎండీగా పని చేస్తున్నారు. దేశంలోనే టీ సిరీస్ ఆడియో సంస్థకు మంచి గుర్తింపు ఉంది.

ఉద్యోగం ఇస్తానని రేప్ చేశాడు
టీ సిరీస్ ఆడియో సంస్థ ఎండీ భూషణ్ కుమార్ ఆయన కంపెనీలో తనకు ఉద్యోగం ఇస్తానని నమ్మించి తనను రేప్ చేశాడని 30 ఏళ్ల యువతి ముంబాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ప్రాజెక్టులో నీకు మంచి ఉద్యోగం ఇస్తానని నమ్మించి 2017 నుంచి 2020 మద్య కాలంలో అనేక ప్రాంతాలకు తనను పిలుచుకుని వెళ్లి అత్యాచారం చేశాడని ఆ యువతి ఆరోపిస్తోంది.

ఎఫ్ఐఆర్ తో భూషణ్ కుమార్ కు షాక్
నీ మీద అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తానని, నా పలుకుబడి ఉపయోగించి కేసు నుంచి నేను తప్పించుకుంటానని భూషణ్ కుమార్ బెదిరిస్తున్నాడని బాధితురాలు ముంబాయి పోలీసులకు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు టీ సిరీస్ ఆడియో సంస్థ యజమాని, ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత భూషణ్ కుమార్ మీద ముంబాయి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆరోజు బచావ్...... ఇప్పుడు ఏమౌతుందో ?
గతంలో కూడా భూషణ్ కుమార్ మీద లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పట్లో సాక్షాలు చిక్కలేదని భూషణ్ కుమార్ మీద పోలీసులు నమోదు చేసిన కేసు నిలబడలేదు. అయితే ఇప్పుడు భూషణ్ కుమార్ మీద బాధితురాలు బలమైన సాక్షాలు పోలీసులకు ఇచ్చిందని సమాచారం. బాలీవుడ్ లో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న టీ సిరీస్ ఆడియో సంస్థ ఎండీ భూషణ్ కుమార్ మీద రేప్ కేసు నమోదు కావడం బాలీవుడ్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications