Lady Teacher: పెళ్లాం టీచర్, పక్కింట్లో పులిహోరా కలిపిన పోలీసు, జీతం తీసుకుని జల్సా!
బెంగళూరు/మైసూరు: మనోడు పోలీసు. భార్య టీచర్ ఉద్యోగం చేస్తూ లక్షణంగా జీతం తీసుకు వచ్చి పోలీసు మొగుడికి ఇస్తోంది. పెళ్లి సమయంలో ఖరీదైన బైక్, బంగారు, విలువైన వస్తులువు తీసుకున్నాడు. పోలీసు బుద్ది చూపించిన మొగుడు భార్యకు తెలీకుండా మరో యువతిని పెళ్లి చేసుకుని సీక్రెట్ గా కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న టీచర్ పెళ్లాం నిలదీయడంతో నీకు పిల్లలు పుట్టడం లేదు, నాకు నీతో కాపురం చేసిచేసి విరక్తి పుట్టింది. అందే టేస్ట్ మార్చానని, నీ పులిహోర నాకు నచ్చడం లేదని ఆమె జీతంతో జల్సా చేస్తున్న పోలీసులు మొగుడు తేల్చి చెప్పాడు. అసలే పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ అమ్మకు మండిపోయి కేసు పెట్టడంతో మనోడి దిమ్మ ఇప్పుడు తిరిగింది.

పోలీసు, టీచరమ్మ పెళ్లి
కర్ణాటకలోని మైసూరు నగరంలోని లష్కర్ పోలీస్ స్టేషన్ లో సమీవుల్లా కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మైసూరు జిల్లా హెచ్.డీ. కోటేలోని ప్రభుత్వ పాఠశాలలో కన్నడ టీచర్ గా ఉద్యోగం చేస్తున్న సిరాజ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో సమీవుల్లా పెళ్లి చెయ్యాలని 2016లో ఇరు కుటుంబ సభ్యులు నిశ్చయించారు.
ఫోటోలు: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంను ప్రారంభించిన ప్రధాని మోడీ

పెళ్లాం దగ్గరే పోలీసు బుద్ది
2017లో సమీవుల్లా, సిరాజ్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుక్కు సమీవుల్లాకు ఖరీదైన బైక్, బంగారు నగలు, విలువైన వస్తువులు కట్నంగా ఇచ్చారు. పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలు టీచరమ్మ సిరాజ్ తో పోలీసు మొగుడు సమీవుల్లా చక్కగానే కాపురం చేశాడు. తరువాత సమీవుల్లా అతని పోలీసు బుద్ది చూపించడం మొదలుపెట్టాడు.

పెళ్లాం జీతంతో జల్సాలు.......పక్కింట్లో పులిహోరా
ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉద్యోగం చేస్తూ నెలనెల వచ్చే జీతం తీసుకు వచ్చి భర్త సమీవుల్లాకు ఇచ్చేస్తున్నది. భార్య సంపాధించిన జీతం మొత్తం తెచ్చి ఇచ్చినా సమీవుల్లా వేరే యువతి మీద మోజు పెంచుకున్నాడు. ఓ పక్క భార్యతో కాపురం చేస్తూనే మరో పక్క వేరే యువతితో పులిహోరా కలిపిన సమీవుల్లా ఆమెకు పూర్తిగా దగ్గర అయ్యాడు.

పోలీసు మొగుడి సీక్రెట్ మ్యారేజ్
మొదటి భార్య సిరాజ్ కు తెలీకుండా సమీవుల్లా వేరే యువతిని సీక్రెట్ గా పెళ్లి చేసుకుని కాపురం పెట్టేశాడు. ఉదయం ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వెలుతున్న సిరాజ్ కు కొంతకాలం ఆమె భర్త సమీవుల్లాకు రెండోపెళ్లి జరిగిన విషయం తెలీలేదు. తరువాత విషయం తెలుసుకున్న భార్య సిరాజ్ భర్త సమీవుల్లాను నువ్వు ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నావ్ అంటూ నిలదీసింది.

కేసు పెడితే రివర్స్ గేర్
నీకు పిల్లలు పుట్టడం లేదని, అందుకే నేను రెండో పెళ్లి చేసుకున్నానని పోలీసు మొగుడు సమీవుల్లా టీచర్ భార్య సిరాజ్ కు టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. తన భర్త, అతని కుటుంబ సభ్యులు తనను విడాకులు ఇవ్వాలని నిత్యం టార్చర్ పెడుతున్నారని, రెండో పెళ్లి చేసుకున్న తన భర్త సక్రమంగా ఇంటికి రావడం లేదని ఆరోపిస్తూ సిరాజ్ మైసూరు మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

పోలీసులు పట్టించుకోలేదు ?
కేసు పెట్టి ఇన్ని రోజులు అయినా తన భర్త సమీవుల్లా పోలీసు కావడంతో ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టీచర్ సిరాజ్ పై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. మొత్తం మీద పోలీసు మొగుడు రెండో పెళ్లి వ్యవహారం మైసూరు నగరంలో, పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications