Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady teacher: అపరిచితుడిని నిద్రలేపిన డాక్టర్ మొగుడు, భార్యను కట్టేసి గోకాడు, పోలీసులు పీకారు !

న్యూఢిల్లీ: విద్యావంతులైన యువతి, యువకుడికి వివాహం చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ప్రముఖ ఆసుపత్రిలో యువకుడు డాక్టర్ గా పని చేస్తున్నాడు. యువతి కేంద్రీయ విద్యాలయంలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. అంతే ముందూవెనుకా ఆలోచించకుండా అమ్మాయి కుటుంబ సభ్యులు డాక్టర్ ను అల్లుడిగా చేసుకున్నారు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల వరకు డాక్టర్ మొగుడు అతని భార్య ఏమి అడిగినా కాదనకుండా తీసిచ్చి ఆమెను సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లాడు. రానురాను దంపతుల జీవితంలో తేడాలు వచ్చాయి. తరువాత అనస్తీషియా డాక్టర్ అతని అసలు స్వరూపం చూపించాడు. భార్యకు ఇంట్లోనే యమలోకం చూపించాడు. భార్యను ఇంట్లో నిర్బందించి కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. డాక్టర్ మొగుడు టైమ్ బాగలేకపోవడంతో అతని భార్య 100కు ఫోన్ చేసి తనను ఇంట్లో నిర్బందించి తన భర్త టార్చర్ చేశాడని ఫిర్యాదు చేసింది. భార్యను గోకిన డాక్టర్ మొగుడికి పోలీసులు నాలుగు పీకి చెయ్యాల్సిన పని చెయ్యడంతో అతని తిక్కకుదిరింది.

ఇద్దరూ విద్యావంతులే

ఇద్దరూ విద్యావంతులే

దేశరాజధాని ఢిల్లీలో నివాసం ఉంటున్న వినీత్ భవన్ అనే యువకుడు, ఢిల్లీలోనే నివాసం ఉంటన్న రాజేశ్వరి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి బాగా చదువుకున్నారు. రాజేశ్వరికి, వినీత్ భవన్ కు వివాహం చేస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారని వారి కుటుంబ సభ్యులు, బందువులు అనుకున్నారు.

గంగారామ్ ఆసుపత్రిలో డాక్టర్

గంగారామ్ ఆసుపత్రిలో డాక్టర్

రాజేశ్వరి కుటుంబ సభ్యులు ముందూవెనుకా ఆలోచించకుండా పెళ్లి చెయ్యాలని సిద్దం అయ్యారు. రాజేశ్వరి కుటుంబ సభ్యులు డాక్టర్ వినీత్ భవన్ ను అల్లుడిగా చేసుకున్నారు. ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో వినీత్ భవన్ సీనియర్ అనస్తీషియా డాక్టర్ గా పని చేస్తున్నాడు. రాజేశ్వరి ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది.

 పెళైన కొత్తలో పిచ్చహ్యీపి

పెళైన కొత్తలో పిచ్చహ్యీపి

వాహం జరిగిన కొన్ని సంవత్సరాల వరకు డాక్టర్ మొగుడు వినీత్ భవన్ అతని భార్య రాజేశ్వరి ఏమి అడిగినా కాదనకుండా తీసిచ్చాడు. రాజేశ్వరిని సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లాడు. వివాహం జరిగిన తరువాత వినీత్ భవన్ వైపు బంధువులు, రాజేశ్వరి వైపు ఉన్న బంధువులు అందరి ఇళ్లకు తిరిగారు. వినీత్ భవన్, రాజేశ్వరి దంపతులు చూడముచ్చటగా ఉన్నారని, జీవితాంతం వీరు చాలా హ్యాపీగా ఉంటారని అందరూ అనుకున్నారు.

 లోపల నిద్రపోతున్న అపరిచితుడిని నిద్రలేపిన డాక్టర్

లోపల నిద్రపోతున్న అపరిచితుడిని నిద్రలేపిన డాక్టర్

అనస్తీషియా డాక్టర్ వినీత్ భవన్ అతనిలో నిద్రపోతున్న అపరిచితుడిని నిద్రలేపాడు. అంతే అక్కడి నుంచి అసలు కథ మొదలైయ్యింది. రానురాను భార్య రాజేశ్వరి మీద డౌట్ పడటం మొదలు పెట్టిన డాక్టర్ వినీత్ భవన్ ఆమె మీద నిఘా వేశాడు. తరువాత వినీత్ భవన్, రాజేశ్వరి దంపతుల జీవితంలో తేడాలు వచ్చాయి. తరువాత అనస్తీషియా డాక్టర్ వినీత్ భవన్ అతని అసలు స్వరూపం చూపించాడు.

భార్యకు ఇంట్లోనే నరకం చూపించిన డాక్టర్

భార్యకు ఇంట్లోనే నరకం చూపించిన డాక్టర్

కొంతకాలంగా డాక్టర్ వినీత్ భవన్ అతని భార్య రాజేశ్వరికి ఇంట్లోనే యమలోకం చూపించాడు. భార్య రాజేశ్వరిని ఇంట్లో నిర్బందించి కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. డాక్టర్ మొగుడు వినీత్ భవన్ టైమ్ బాగలేకపోవడంతో అతని భార్య 100కు ఫోన్ చేసి తనను ఇంట్లో నిర్బందించి తన భర్త వినీత్ భవన్ టార్చర్ చేశాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు వెళ్లి రాజేశ్వరిని రక్షించి ఆమె దగ్గర స్టేట్ మెంట్ తీసుకున్నారని ఢిల్లీ ఆగ్నేయ విభాగం డీసీపీ ఈషా పాండే స్థానిక మీడియాకు చెప్పారు. భార్యను గోకిన డాక్టర్ మొగుడు వినీత్ భవన్ కు పోలీసులు నాలుగు పీకి కేసు నమోదు చేసి చెయ్యాల్సిన పని చెయ్యడంతో అతని తిక్కకుదిరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+