Lady teacher: భర్త లాయర్, కొడుకు టెక్కీ, ఇంట్లో మాయం అయిన లేడీ టీచర్ బావిలో ?!
బెంగళూరు/మంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు కాలేజ్ లో చదువుతోంది. భర్త న్యాయవాది కావడంతో వేరే ఊరిలో ఉంటున్నాడు. భార్య టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. సొంత ఇంటిలో పిల్లలకు భార్య ట్యూషన్ చెబుతోంది. భర్త లాయర్ గా వేరే ఊరిలో ఉండటం, కొడుకు ఉద్యోగం చేస్తూ సిటీలో ఉండటంతో లేడీ టీచర్ ఆమె తల్లి, కూతురితో కలిసి ఉంటోంది. ఇంట్లో ఉన్న లేడీ టీచర్ కనపడకుండా పోయింది. లేడీ టీచర్ తల్లి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటి నుంచి వెళ్లి కనపడకుండా పోయిన లేడీ టీచర్ బావిలో శవమై కనిపించడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరు సమీపంలో ఉల్లాళలో హరిణాక్షి అలియాస్ హరిణి (50) అనే మహిళ నివాసం ఉంటున్నది. 25 సంవత్సరాల క్రితం బసవరాజ్ అనే వ్యక్తితో హరిణి వివాహం జరిగింది. వివాహం చేసుకున్న బసవరాజ్, హరిణి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. హరిణి, బసవరాజ్ దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు.

భర్త, కొడుకు వేరే ఊరిలో ఉంటున్నారు
కొడుకు ప్రముఖ ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. హరిణి కూతురు కాలేజ్ లో డిగ్రీ చదువుతోంది. హరిణి భర్త బసవరాజ్ న్యాయవాది కావడంతో ఆయన శివమొగ్గలో ఉంటున్నారు. హరిణి ఉల్లాళలో టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. ఉల్లాళలోని అబ్బక్క సర్కిల్ లోని సొంత ఇంటిలో కూతురు, కన్న తల్లితో కలిసి నివాసం ఉంటున్న హరిణి సాయంత్రం పూట స్కూల్ పిల్లలకు ట్యూషన్ చెబుతోంది.

ఇంటిలో మాయం అయిన లేడీ టీచర్
కొడుకు ఉద్యోగం చేస్తూ సిటీలో ఉండటం, భర్త బసవరాజ్ శివమొగ్గలో ఉండటంతో లేడీ టీచర్ హరిణి ఆమె తల్లి, కూతురితో కలిసి ఉంటోంది. ఇంట్లో ఉన్న లేడీ టీచర్ హరిణి కనపడకుండా పోయింది. లేడీ టీచర్ హరిణి కనపడటం లేదని ఆమె తల్లి ఉల్లాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి హరిణి కోసం గాలించారు.
Recommended Video


బావిలో శవమైన లేడీ టీచర్
ఉల్లాళలోని ఆరోగ్యం కేంద్రం ఆవరణంలోని బావి దగ్గర హరిణి వేసుకునే చెప్పులు కనిపించాయి. అగ్నిమాపక సిబ్బంది బావిలో దిగి వెతికారు. ఇంటి నుంచి వెళ్లి కనపడకుండా పోయిన లేడీ టీచర్ హరిణి బావిలో శవమై కనిపించడం ఉల్లాళలో కలకలం రేపింది. హరిణి ఆత్మహత్య చేసుకుందా ?, ఎవరైనా హత్య చేసి ఆమె శవం బావిలో విసిరేశారా ? అని ఆరా తీస్తున్నామని ఉల్లాళ పోలీసులు తెలిపారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications