lady: PM రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తామని ?, ఆమె డబ్బులు తీసుకుని గ్యాంగ్ రేప్, నీ సినిమా నీకే చూపిస్తాం!
చెన్నై/లక్నో/సంభాల్: మహిళలను అనుభవించడానికి కామాంధులు అనేక స్కెచ్ లు వేస్తున్నారు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటూ ఏదైన పని చేసుకుని జీవించాలని ప్రయత్నిస్తున్న మహిళ మీద కామాంధులు కన్ను వేశారు. ప్రధాన మంత్రి పరిహార నిధి (PM relief fund) ఇప్పిస్తామని నమ్మించి ఆమె దగ్గరే డబ్బులు తీసుకున్న కిరాతకులు ఆమెనే గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ చేసే సమయంలో ఆమె నగ్న వీడియోలు తీసిన కామాంధులు పోలీసు కేసు పెడితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి నీ సినిమా నీకే చూపిస్తామని బెదిరించడం కలకలం రేపింది.

భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళ
భారతదేశంలో ఎక్కువగా నేరాలు, ఘోరాలు జరుగుతున్న రాష్ట్రాల మొదటి వరుసలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లా అస్కోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సఖాసా గ్రామంలో నివాసం ఉంటున్న మహిళ భర్త చనిపోయాడు. భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటూ ఏదైనా పని కాని, వ్యాపారం కాని చేసుకుని తన కాళ్ల మీద తాను నిలబడాలని ప్రయత్నాలు చేస్తున్నది.

ప్రధాని రిలీఫ్ ఫండ్ కోసం ప్రయత్నాలు
భర్త చనిపోయి ఎలాంటి ఆధారం లేకుండా ఒంటరిగా ఉంటున్న విధవలకు ప్రధాన మంత్రి పరిహార నిధి (పీఎం రిలీఫ్ ఫండ్) కింద రూ. 5 లక్ష్లలు ఇస్తారని, ఆ డబ్బుతో నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉందని, ఆ డబ్బు నీకు అందేలా మేము చూస్తామని కొందరు కామాంధులు ఆ మహిళకు మాయమాటలు చెప్పారు.

లంచం తీసుకున్న కామాంధులు
ప్రధాని రిలీఫ్ ఫండ్ మీకు రావాలంటే రూ. 5 వేలు ఖర్చు అవుతుందని చెప్పిన కేటుగాళ్లు ముందుగా ఆమె నుంచి రూ. 2 వేలు అడ్వాన్స్ తీసుకున్నారు. పీఎం పరిహార నిధికి కావలసిన పత్రాలు మేము సిద్దం చేస్తామని, ఒకసారి నువ్వు అధికారులతో మాట్లాడాల్సి ఉంటుందని కామాంధులు భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఆ మహిళను నమ్మించారు.

ఆమె డబ్బులు తీసుకుని ఆమెనే గ్యాంగ్ రేప్ చేశారు
మామిడి తోటలోకి అధికారులు వస్తున్నారని, అక్కడికి నువ్వు వచ్చి పత్రాల మీద సంతకాలు చేస్తే నీకు రూ. 5 లక్షలు వస్తాయని ఆమెను నమ్మించారు. మహిళ దగ్గర లంచం తీసుకున్న కామాంధులు ఆమెను మామిడి తోటలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. మహిళ కేకలు వెయ్యకుండా ఆమె నోట్లు బట్టలు కుక్కేశారు.

రేప్ వీడియో.... నీ సినిమా నీకే చూపిస్తాం
మహిళ మీద గ్యాంగ్ రేప్ చేసే సమయంలో మొత్తం వీడియో తీశారు. నువ్వు పోలీసు కేసు పెడితే నీ అంతు చూస్తామని, నీ నగ్నవీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసి నీ సినిమా నీకే చూపిస్తామని కామాంధులు ఆ మహిళను బెదిరించారు. జరిగింది మరిచిపోయి నువ్వు మర్యాదగా ఉండిపోతే నీకే మంచిదని, లేదంటే నిన్ను చంపేస్తామని ఆమెను బెదిరించారు.

మామిడి తోటలోకి ఎందుకుపోయావు ? అది నీ ఖర్మ
బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే నీ ఖర్మకాలి నువ్వు మామిడి తోటలోకి వెళ్లి రేప్ చేయించుకున్నావు, మమ్మల్ని ఏం చెయ్యమంటావు అంటూ కేసు నమోదు చెయ్యడానికి పోలీసులు నిరాకరించారు. పోలీసులు చేతులు ఎత్తేయడతో బాధితురాలు ఓ న్యాయవాది సహాయంతో కోర్టును ఆశ్రయించింది. కోర్టు చివాట్లు పెట్టడంతో కళ్లు తెలిరిచిన పోలీసులు కేసు నమోదు చేసి మహిళ మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధుల కోసం గాలిస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications