
Lady: కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్, 6 ఏళ్ల కూతుర్ని వదలని కామాంధులు, లిఫ్ట్ ఇస్తామని !
డెహ్రాడూన్/ హరిద్వార్/ ముంబాయి: కూతురితో కలిసి ధార్మిక కేంద్రానికి వెళ్లిన మహిళ ప్రార్థనలు ముగించుకుని సాయంత్రం ఇంటికి బయలుదేరింది. ధార్మిక కేంద్రం నుంచి బయటకు వచ్చిన మహిళకు లిఫ్ట్ ఇస్తానని ఓ వ్యక్తి చెప్పాడు. మహిళ, ఆమె కూతురు కారులో ఎక్కారు. అప్పటికే లిఫ్ట్ ఇస్తానని చెప్పిన వ్యక్తితో పాటు అతని ఫ్రెండ్స్ కారులో ఉండటంతో కారు డోర్ లాక్ చేసేశారు. వేగంగా వెలుతున్న కారులోనే మహిళ మీద సామూహిక అత్యాచారం చేశారు. మహిళ ఆరు సంవత్సరాల కుమార్తె మీద కామాంధులు లైంగికదాడి చేశారు. చాలాదూరం వెళ్లిన తరువాత మహిళను, ఆమె కూతురిని రోడ్డు పక్కన వదిలేసిన కామాంధులు మాయం అయ్యారు. కారులో ఎంతమంది ఉన్నారు ?, ఎంత మంది సామూహిక అత్యాచారం చేశారు ? అనే విషయం మహిళ కచ్చితంగా చెప్పలేకపోయిందని పోలీసులు అంటున్నారు.
Lovers:
నీతో
ఎంజాయ్
చేశాను,
నిన్ను
పెళ్లి
చేసుకోను
అని
చెప్పిన
ప్రియురాలు,
ప్రియుడు
ఏం
చేశాడంటే!

ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లిన మహిళ
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడున్ సమీపంలో ఓ మహిళ నివాసం ఉంటున్నది. ఆమెకు ఆరు సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె ఉంది. పిరాన్ కలియార్ ప్రాంతంలోని ముస్లీం ధార్మిక కేంద్రానికి వెళ్లింది. కూతురితో కలిసి ధార్మిక కేంద్రానికి వెళ్లిన మహిళ ప్రార్థనలు ముగించుకుని సాయంత్రం ఇంటికి హరిద్వార్ బయలుదేరింది.

కారులో డ్రాప్ ఇస్తామని నమ్మించి
ధార్మిక కేంద్రం నుంచి బయటకు వచ్చిన మహిళకు లిఫ్ట్ ఇస్తానని సోనూ అనే వ్యక్తి చెప్పాడు. మహిళ, ఆమె కూతురు కారులో ఎక్కారు. అప్పటికే లిఫ్ట్ ఇస్తానని చెప్పిన సోనూ పాటు అతని ఫ్రెండ్స్ కారులో ఉండటంతో కారు డోర్ లాక్ చేసేశారు. వేగంగా వెలుతున్న కారులోనే మహిళ మీద సామూహిక అత్యాచారం చేశారు.

చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు
మహిళ ఆరు సంవత్సరాల కుమార్తె మీద కామాంధులు లైంగికదాడి చేశారు. చాలాదూరం వెళ్లిన తరువాత మహిళను, ఆమె కూతురిని రోడ్డు పక్కన వదిలేసిన కామాంధులు ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. బాధితురాలు, ఆమె కూతురితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఒక్కడి పేరు మాత్రం తెలిసింది
లిఫ్ట్ ఇస్తానని చెప్పిన వ్యక్తి పేరు సోనూ అని బాధితురాలు చెప్పిందని, కారులో ఎంతమంది ఉన్నారు ?, ఎంత మంది సామూహిక అత్యాచారం చేశారు ? అనే విషయం ఆమె కచ్చితంగా చెప్పలేకపోయిందని, తల్లీ కూతురిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని హరిద్వార్ గ్రామీణ జిల్లా ఎస్పీ ప్రేమేంద్ర దోవల్ స్థానిక మీడియాకు చెప్పారు. కదులుతున్న కారులోనే మహిళ మీద సామూహిక అత్యాచారం చేసి ఆమె కూతురి మీద లైంగిక దాడి చెయ్యడం హరిద్వార్ ప్రాంతంలో కలకలం రేపింది.