Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: తల్లితో ? కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది, లక్షలు లాగేశారు, చెట్టుకు శవమైనాడు !

బెంగళూరు/ మండ్య: చదువుకోవడం ఇష్టం లేకపోవడంతో చిన్న వయసులోనే అతను సిటీకి వెళ్లిపోయి హోటల్ లో పనికి చేరాడు. లక్షల రూపాయల డబ్బులు సంపాధించిన తరువాత సొంత ఊరుకు వెళ్లిన ఆ యువకుడు సొంతంగా గూడ్స్ వాహనం పెట్టుకుని అద్దెకు తిప్పుతూ డబ్బులు సంపాధిస్తున్నాడు. ఇదే సమయంలో స్నేహితుడి ద్వారా అందంగా ఉన్న మహిళ ఆ యువకుడికి పరిచయం అయ్యింది. ఆ యువకుడు ఆ మహిళతో చనువు పెంచుకున్నాడు. తరువాత ఆమె కుమార్తెను ఇచ్చి నీకు పెళ్లి జరిపిస్తామని స్నేహితుడు అతనికి మాయమాటలు చెప్పాడు. కూతురిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తానని మహిళ కూడా ఆ యువకుడు హామీ ఇచ్చింది. స్నేహితుడు, ఆ అమ్మాయి తల్లి కలిసి ఆ యువకుడి దగ్గర లక్షల రూపాయల డబ్బులు లాగేశారు. చివరికి యువతికి ఇంకా 18 సంవత్సరాలు నిండలేదని, ఆమెకు 17 సంవత్సరాల వయసు మాత్రమే ఉందని, పెళ్లి చెయ్యడం ఇప్పుడే సాధ్యం కాదని, ఇంకా సంవత్సరం వేచి చూడాలని ఆమె తల్లి అడ్డం తిరిగింది. ఇంతకాలం తనతో చనువుగా ఉన్న మహిళ ఆమె కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి కదురదని చెప్పడంతో ఆ యువకుడు షాక్ అయ్యాడు. తరువాత మహిళ, ఆమె కూతురితో కలిసి ఐటీ హభ్ కు వెళ్లిన యువకుడు మూడు రోజుల తరువాత చెరువు పక్కన చెట్టుకు శవమై కనిపించాడు.

8వ తరగతిలోనే ఎస్కేప్

8వ తరగతిలోనే ఎస్కేప్

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని కేఆర్ పేట తాలుకాలోని హోడహళ్ళి గ్రామంలో కాంతరాజు నివాసం ఉంటున్నాడు. 8వ తరగతి చదువుతున్న సమయంలోనే కాంతరాజుకు చదవడం ఇష్టంలేక అతను బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరులోని ఓ హోటల్ మొదట పనిలో చేరిన కాంతరాజు అప్పటి నుంచి సిటీలోనే నివాసం ఉంటూ అనేక హోటల్స్ లో పని చేస్తూ లక్షల రూపాయల డబ్బులు సంపాధించారు.

సొంతఊరు చేరుకున్న యువకుడు

సొంతఊరు చేరుకున్న యువకుడు

కాంతరాజుకు ప్రస్తుతం 26 సంవత్సరాలు. ఆరు నెలల క్రితం సొంత ఊరు చేరుకున్న కాంతరాజు సొంతంగా గూడ్స్ వాహనం పెట్టుకుని అద్దెకు తిప్పుతూ డబ్బులు సంపాధిస్తున్నాడు. కాంతరాజుకు అతని చిన్ననాటి స్నేహితులు అందరూ దగ్గర అయ్యారు. ఇదే సమయంలో కాంతరాజుకు అతని చిన్ననాటి స్నేహితుడు లోకేష్ ద్వారా అందంగా ఉన్న పూర్ణిమా (42) అనే మహిళ ఆ యువకుడికి పరిచయం అయ్యింది.

మహిళతో చనువు..... కూతురిని పెళ్లి చేసుకోవాలని

మహిళతో చనువు..... కూతురిని పెళ్లి చేసుకోవాలని

పూర్ణిమాకు అందంగా ఉన్న 17 ఏళ్ల కుమార్తె ఉంది. కాంతరాజు దగ్గర లక్షల రూపాయల డబ్బులు ఉండటం, సొంతంగా గూడ్స్ వాహనం ఉండటం, ఒకే కులం కావడంతో పూర్ణిమా కూతురిని ఇచ్చి పెళ్లి జరిపిస్తానని లోకేస్ అతనికి మాయమాటలు చెప్పాడు. ఇదే సమయంలో కాంతరాజుకు, పూర్ణిమా ఇద్దరూ ఎక్కువగా చనువు పెంచుకున్నారు.

 రూ. లక్షలు డబ్బు లాగేసిన ఆంటీ, ఫ్రెండ్

రూ. లక్షలు డబ్బు లాగేసిన ఆంటీ, ఫ్రెండ్

తరువాత పూర్ణిమా నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తామని కాంతరాజుకు మాయమాటలు చెప్పింది. కూతురిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తానని పూర్ణిమా, స్నేహితుడు లోకేష్ కూడా కాంతరాజుకు హామీ ఇచ్చారు. స్నేహితుడు లోకేష్, మైనర్ అమ్మాయి తల్లి పూర్ణిమా కలిసి కాంతరాజు దగ్గర ఇప్పటి వరకు సుమారు రూ. 5 లక్షల రూపాయల డబ్బులు లాగేశారు.

 అడ్డం తిరిగిన అమ్మాయి తల్లి

అడ్డం తిరిగిన అమ్మాయి తల్లి

ఇటీవల యువతికి ఇంకా 18 సంవత్సరాలు నిండలేదని, ఆమెకు 17 సంవత్సరాల వయసు మాత్రమే ఉందని, పెళ్లి చెయ్యడం ఇప్పుడే సాధ్యం కాదని, ఇంకా సంవత్సరం వేచి చూడాలని ఆమె తల్లి పూర్ణిమా అడ్డం తిరిగింది. ఇంతకాలం తనతో చనువుగా ఉన్న పూర్ణిమా ఆమె కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి కదురదని చెప్పడంతో కాంతరాజు షాక్ అయ్యాడు. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కాంతరాజు పూర్ణిమా, లోకేష్ కు తేల్చి చెప్పాడు.

ఊరు వదిలేయాలని డిసైడ్ అయిన కాంతరాజు

ఊరు వదిలేయాలని డిసైడ్ అయిన కాంతరాజు


ఈ విషయం పోలీస్ స్టేషన్ లో పంచాయితీలు చేసే వరకు వెళ్లింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడానికి కొంత సమయం కావాలని పూర్ణిమా, లోకేష్ పోలీసుల ముందు కాంతరాజుకు మనవి చేశారు. త్వరలో తన డబ్బు తనకు వస్తుందని, ఈ ఊరు వద్దు, పూర్ణిమా కూతురు వద్దు, నేను బెంగళూరు వెళ్లిపోతానని కాంతరాజు ఇటీవల అతని స్నేహితుల ముందు చెప్పాడని తెలిసింది.

తల్లి కూతురితో వెళ్లి శవమైన యువకుడు

తల్లి కూతురితో వెళ్లి శవమైన యువకుడు

జనవరి 6వ తేదీన కాంతరాజు అదే ఊరిలో ఉంటున్న పూర్ణిమా, ఆమె కూతురితో కలిసి బెంగళూరు వెళ్లాడని అతని స్నేహితులు అంటున్నారు. జనవరి 8వ తేదీన కాంతరాజు నాగమంగల సమీపంలోి చెరువు పక్కన ఉన్న చెట్టుకు కాంతరాజు శవమై కనిపించాడు. ముందు రోజు కాంతరాజు అతని తల్లికి ఫోన్ చేసి తాను దేవుడి దగ్గరకు వెలుతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడని తెలిసింది. అయితే కాంతరాజును పూర్ణిమా, లోకేష్ హత్య చేసి ఉంటారని కాంతరాజు కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. పరారైన లోకేష్, పూర్ణిమా కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+