Lady: బీర్ బాటిల్ పగలగొట్టి యువతి ముఖం చెక్కేశాడు, కడుపులో, ఛాతీలో పొడిచి ?, 25 కుట్లు, ఎవడు ?
చెన్నై: హోటల్ మేనేజ్ మెంట్ చదువుకున్న యువతి వేరే రాష్ట్రానికి వెళ్లి ఫేమస్ రెస్టారెంట్ లో మంచి ఉద్యోగంలో చేరింది. రెస్టారెంట్ లో ఉద్యోగం చేసే వాళ్లకు ఆ రెస్టారెంట్ వెనుకనే హాస్టల్ ఉంది. ప్రతిరోజు రెస్టారెంట్ లో ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న యువతి రాత్రి పని ముగించుకుని హాస్టల్ కు వెళ్లి అక్కడే ఉంటున్నది. ఎప్పటిలాగే రాత్రి ఆ యువతి ఉద్యోగం ముగించుకుని హాస్టల్ కు బయలుదేరింది. మార్గం మధ్యలో ఓ యువకుడు ఆమెతో గొడవ పెట్టకున్నాడు. బీర్ బాటిల్ తో ఆమె ముఖం మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. బీర్ బాటిల్ పగలగొట్టి ఆమె కడుపు, ఛాతీ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో ఆమె ముఖం మీద 25 కుట్లు పడ్డాయి.

కేరళ టూ చెన్నై
కేరళలోని ఆంపూరి సమీపంలోని కర్తనక్కల్ ప్రాంతంలో సోను జోసెఫ్ అలియాస్ సోనూ (20) అనే యవతి నివాసం ఉంటున్నది. హోటల్ మేనేజ్ మెంట్ చదువుకున్న సోనూ జోసెఫ్ మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది, చెన్నై సిటీలోని కీలపక్కాంలోని అబు ప్యాలెస్ రెస్టారెంట్ లో సోనూ జోసెఫ్ కు ఉద్యోగం వచ్చింది.

రెస్టారెంట్ వెనుక హాస్టల్
మూడు నెలల క్రితం చెన్నై చేరుకున్న సోనూ జోసెఫ్ అబు ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉద్యోగంలో చేరింది. చెన్నైలో అబు ప్యాలెస్ రెస్టారెంట్ చాలా ఫేమస్ కావడంతో సోనూ జోసెఫ్ మంచి జీతం తీసుకుంటున్నది. అబు ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉద్యోగం చేసే వాళ్లకు ఆ రెస్టారెంట్ వెనుకనే హాస్టల్ ఉంది. ప్రతిరోజు రెస్టారెంట్ లో ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న సోనూ రాత్రి పని ముగించుకుని హాస్టల్ కు వెళ్లి అక్కడే ఉంటున్నది.

బీర్ బాటిల్ తో ముఖం మీద దాడి
ఎప్పటిలాగే రాత్రి సోనూ జోసెఫ్ ఉద్యోగం ముగించుకుని హాస్టల్ కు బయలుదేరింది. మార్గం మధ్యలో 25 ఏళ్ల వయసు ఉన్న ఓ యువకుడు సోనూ జోసెఫ్ ను అడ్డుకుని ఆమెతో గొడవ పెట్టకున్నాడు. ఆ సందర్బంలో పీకల మత్తులో ఉన్న ఆ యువకుడు అతని చేతిలోని బీర్ బాటిల్ తో సోనూ జోసెఫ్ ముఖం మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. సోనూ జోసెఫ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది,

సోనూ ముఖం మీద 25 కుట్లు
ఆ సందర్బంలో బీర్ బాటిల్ పగలగొట్టిన కిరాతకుడు సోనూ జోసోఫ్ కడుపు, ఛాతీ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. సోనూ జోసెఫ్ గట్టిగా కేకలు వెయ్యడంతో నిందితుడు అక్కడి నుంచి బైక్ లో పరారైనాడు. అక్కడికి వెళ్లిన స్థానికులు తీవ్రగాయాలైన సోనూ జోసెఫ్ ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ఏం జరిగింది ?, ఎవరు అతను
సోనూ జోసెఫ్ ముఖం మీద 25 కుట్లు పడ్డాయి. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే సోనూ జోసెఫ్ మీద ఎందుకు దాడి జరిగింది ?, దాడి చేసిన యువకుడు ఎవరు ?, ఇద్దరికి ఏమిటి సంబంధం ? అనే విషంలో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications