Wife: డ్యాన్స్ టీచర్ తో టెక్కీ లవ్ మ్యారేజ్, అందమైన భార్యతో వ్యాపారం చెయ్యాలని, నిద్రమాత్రలు వేసి !
చెన్నై/కడలూరు/సింగపూర్: చిన్నప్పటి నుంచి ఓ యువతికి సినిమా కష్టాలు ఎదురైనాయి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పెంపుడు తండ్రి సంరక్షణలో పెరిగింది. పెంపుడు తండ్రి కూడా మరణించడంతో ఆయువతి కష్టపడి డ్యాన్స్ టీచర్ అయ్యింది. తన నైపుణ్యం, తెలివితేటలతో కష్టపడి పని చేసిన యువతి అతి కష్టం మీద సింగపూర్ చేరుకుని అక్కడ డ్యాన్స్ స్కూల్ పెట్టింది. సింగపూర్ లో భారతదేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన అమ్మాయిలు, అబ్బాయిలకు డ్యాన్స్ నేర్పించింది. ఆ సమయంలో పరిచయం అయిన ఇంజనీర్ తో ప్రేమలో పడి తరువాత ప్రేమ వివాహం చేసుకుంది. కొంతకాలం తరువాత ఇంజనీరు అయిన తన భర్త తనను సెక్స్ పరిశ్రమలోకి నెట్టడానికి ప్రయత్నించడంతో యువతి షాక్ అయ్యింది. కొంతకాలానికి తన భర్త తనను సెక్స్ పరిశ్రమ నిర్వహకులకు అమ్మేయడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న భార్య హడలిపోయింది. వివాహం జరిగినప్పటి నుంచి తనకు నిద్రమాత్రలు ఇస్తున్న భర్త తన నగ్న వీడియోలు, ఫోటోలు తీస్తున్నాడని, వాటిని ఇతరులకు షేర్ చేస్తున్నాడని తెలుసుకుని షాక్ అయ్యింది. చుట్టుపక్క వారి సహాయంతో ఇంటి నుంచి తప్పించుకున్న భార్య ఇప్పుడు జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఇంతకాలం అరాచకాలు చేసిన భర్త మీద కేసు పెట్టడం కలకలం రేపింది.

వెంటాడిన సినిమా కష్టాలు
తమిళనాడుకు చెందిన ఐశ్వర్య (28) అనే యువతికి చిన్నప్పటి సినిమా కష్టాలు ఎదురైనాయి. చిన్నతనంలోనే ఐశ్వర్య తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పెంపుడు తండ్రి సంరక్షణలో పెరిగింది. పెంపుడు తండ్రి కూడా మరణించడంతో ఐశ్వర్య కష్టపడి డ్యాన్స్ టీచర్ అయ్యింది. తన నైపుణ్యం, తెలివితేటలతో కష్టపడి పని చేసిన ఐశ్వర్య 2017లో అతి కష్టం మీద సింగపూర్ చేరుకునింది.

డ్యాన్స్ టీచర్.... సినిమాల్లో అవకాశం
సింగపూర్ చేరుకుని ఐశ్వర్య అక్కడ డ్యాన్స్ స్కూల్ పెట్టింది. సింగపూర్ లో భారతదేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన అమ్మాయిలు, అబ్బాయిలకు ఐశ్వర్య డ్యాన్స్ నేర్పించింది. సింగపూర్ లో ఉన్న సమయంలోనే ఐశ్వర్యకు డేంజన్ కర్వ్, గైడ్ గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో పని చెయ్యడానికి అవకాశం వచ్చింది. చిన్నప్పటి నుంచి కష్టాలతో పెరిగిన ఐశ్వర్యకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇంజనీర్ తో ప్రేమలో పడిన ఐశ్వర్య
తమిళనాడులోని కడలూరు జిల్లా, ముతసాల్ ఒడై ప్రాంతానికి చెందిన ఆటో మొబైల్ ఇంజనీర్ అరుణ్ (29) అనే యువకుడితో 2019లో సింగపూర్ లో పరిచయం అయ్యింది. అరుణ్ సింగపూర్ లో ఉద్యోగం చేస్తుండటంతో ఐశ్వర్యకు దగ్గర అయ్యాడు. తరువాత ఐశ్వర్య, అరుణ్ ఇద్దరూ ప్రేమించుకుని సింగపూర్ లో కలిసిమెలసి తిరిగారు.

సింపుల్ గా వివాహం
సింగపూర్ నుంచి ఐశ్వర్య, అరుణ్ తమిళనాడు చేరుకున్నారు. ఐశ్వర్యకు కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేకపోవడంతో ఆమెను వివాహం చేసుకుంటానని అరుణ్ అతని కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లికి ఒప్పించాడు. కడలూరులోని ఓ దేవాలయంలో అరుణ్ కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఐశ్వర్య అతనిని వివాహం చేసుకుంది.

మూడు నెలలకే పంచాయితీలు
వివాహం జరిగిన తరువాత అరుణ్ కుటుంబ సభ్యులతో కలిసి ఐశ్వర్య అతని ఇంటిలో ఉంది. వివాహం జరిగిన మూడు నెలలకే అరుణ్ కుటుంబ సభ్యులతో ఐశ్వర్యకు గొడవలు మొదలైనాయి. తరువాత అరుణ్ అతని భార్య ఐశ్వర్యతో చెన్నై చేరుకుని అక్కడ అద్దె ఇంటిలో కాపురం పెట్టాడు. కొంతకాలానికి ఐశ్వర్యను చెన్నైలో వదిలిపెట్టిన అరుణ్ ఉద్యోగం చెయ్యడానికి సింగపూర్ వెళ్లిపోయాడు. కొంతకాలానికి ఐశ్వర్య కూడా సింగపూర్ వెళ్లింది.

చంపడానికి ప్రయత్నించిన భర్త ఫ్యామిలీ
8 నెలల క్రితం అరుణ్, ఐశ్వర్య సింగపూర్ నుంచి తమిళనాడు చేరుకున్నారు. గురువారం చుట్టుపక్క వారి సహాయంతో ఇంటి నుంచి తప్పించుకున్న ఐశ్వర్య కడలూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఇంతకాలం అరాచకాలు చేసిన భర్త అరుణ్ మీద కేసు పెట్టడం కలకలం రేపింది. తరువాత అరుణ్ ఇంటికి ఐశ్వర్య వెళ్లింది. ఇంట్లో ఉన్న ఐశ్వర్యను ఆమె అత్తమామలు (అరుణ్ తల్లిదండ్రులు) చంపడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ఐశ్వర్య గొంతు బిగించి ఆమె మీద కిరోసిన్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించారని ఐశ్వర్య ఆరోపిస్తోంది.

సెక్స్ పరిశ్రమలోకి రావాలని ఒత్తిడి
సింగపూర్ నుంచి వచ్చిన తరువాత భర్త అరుణ్ లో చాలా మార్పులు వచ్చాయని ఐశ్వర్య ఆరోపిస్తోంది. తనను సెక్స్ పరిశ్రమలోకి రావాలని తన భర్త అరుణ్ ఒత్తిడి చేశాడని తాను షాక్ అయ్యానని ఐశ్వర్య అంటోంది. తనను సెక్స్ పరిశ్రమ నిర్వహకులను అమ్మేయాలని తన భర్త అరుణ్ ప్రయత్నాలు చేశాడని ఐశ్వర్య ఆరోపిస్తోంది.

భార్య నగ్న వీడియోలు తీసిన భర్త
బెడ్ రూమ్ లో ఐశ్వర్య దుస్తులు మార్చుకునే సమయంలో ఆమె భర్త అరుణ్ ఫోటోలు, వీడియోలు తీశాడు. ఆ సమయంలో తన భర్త అరుణ్ ను ఎందుకు నువ్వు వీడియోలు, ఫోటోలు తీస్తున్నావని ప్రశ్నిస్తే అతను తిక్కతిక్క సమాధాలు చెప్పాడని, నువ్వు సెక్స్ పరిశ్రమలోకి రావాలని తన భర్త ఒత్తిడి చేశాడని ఐశ్వర్య అంటోంది.
Recommended Video

ఇంజనీర్ భర్త మీద కేసు పెట్టిన ఐశ్వర్య
తనను సెక్స్ పరిశ్రమలోకి వెళ్లకుంటే ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని తన భర్త అరుణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఐశ్వర్య ఆరోపిస్తోంది. వివాహం జరిగినప్పటి నుంచి తనకు నిద్రమాత్రలు ఇస్తున్న భర్త తన నగ్న వీడియోలు తీస్తున్నాడని, వాటిని ఇతరుకుల షేర్ చేస్తున్నాడని తెలుసుకుని షాక్ అయ్యింది. చుట్టుపక్క వారి సహాయంతో ఇంటి నుంచి తప్పించుకున్న భార్య ఇప్పుడు పోలీసులను ఆశ్రయించి ఇంతకాలం అరాచకాలు చేసిన భర్త మీద కేసు పెట్టడం కలకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications