Lady: రోడ్డు పక్కన సూట్ కేసు, వాకింగ్ వెలుతున్న వాళ్లు చూస్తే, నైటీలో యువతి శవం చుట్టేసి, షాక్ !
చెన్నై/ తిరుపూర్: నిత్యం రద్దీగా ఉండే సిటీలో ఉదయం, సాయంత్రం స్థానికులు పార్క్ లు, రోడ్డు పక్కన వాకింగ్ చేస్తుంటారు. ప్రతినిత్యం ఎప్పటిలాగే స్థానికులు వాకింగ్ కు వెళ్లారు. ఉదయం నుంచి రోడ్డు పక్కన ఖరీదైన సూట్ కేస్ అలాగే పడిఉండటం, దాని వైపు ఎవ్వరూ చూడకుండా నిర్లక్షంగా వెలుతున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న కొందరికి అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూశారు. సూట్ కేసులో నుంచి రక్తం కారుతున్న విషయం గమనించిన స్థానికులు, వాకింగ్ వెలుతున్న వాళ్లు హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకుని సూట్ కేసు ఓపెన్ చెయ్యడంతో స్థానికులు బిత్తరపోయారు. ఖరీదైన సూట్ కేసులో నైటీ చుట్టిన ఓ యువతి మృతదేహం బయటపడంతో అందరూ హడలిపోయారు. హత్యకు గురైన యువతి పేరు, వివరాలు ఏమాత్రం చిక్కకుండా హంతకులు జాగ్రతలు పడ్డారని పోలీసు అధికారులు అంటున్నారు. సూట్ కేసులో ఉన్న యువతి ఫోటోలు చేతిలో పట్టుకున్న పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. యువతిని వేరే ప్రాంతంలో హత్య చేసిన నిందితులు ఎలాంటి సాక్షాలు చిక్కకుండా సూట్ కేసులో శవం తీసుకువచ్చి ఇక్కడ విసిరేసి ఉంటారని పోలీసు విచారణ చేస్తున్న అధికారులు అంటున్నారు.

రద్దీగా ఉండే ఏరియా
తమిళనాడులోని తిరుప్పూర్ కార్పోరేషన్ పరిధిలోని తారాపురంలోని పొల్లికలిపాళయర్ ప్రాంతంలోని పార్క్ ల్లో, ఆ పరిసర ప్రాంతాల్లోని విశాలమైన రహదారుల్లో స్థానికులు ప్రతినిత్యం ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తుంటారు. ఉదయం ఎక్కువగా తిరుపూర్ లో వాకింగ్ చేసే వాళ్లు ఎక్కువగా సంచరిస్తుంటారు.

రోడ్డు పక్కన ఖరీదైన సూట్ కేస్
ప్రతినిత్యం ఎప్పటిలాగే స్థానికులు తారాపురంలోని పొల్లికలిపాళయర్ ప్రాంతంలో వాకింగ్ కు వెళ్లారు. ఉదయం నుంచి రోడ్డు పక్కన ఖరీదైన నీలిరంగు సూట్ కేస్ అలాగే పడిఉండటం, దాని వైపు ఎవ్వరూ చూడకుండా నిర్లక్షంగా వెలుతున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న కొందరికి అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూశారు.

సూట్ కేస్ ఓపెన్ చేస్తే ?
సూట్ కేసులో నుంచి రక్తం కారుతున్న విషయం గమనించిన స్థానికులు, వాకింగ్ వెలుతున్న వాళ్లు హడలిపోయి తిరుపూర్ సిటీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకుని సూట్ కేసు ఓపెన్ చెయ్యడంతో స్థానికులు బిత్తరపోయారు. ఖరీదైన సూట్ కేసులో నైటీ చుట్టిన 25 ఏళ్ల యువతి మృతదేహం బయటపడంతో అందరూ హడలిపోయారు.

ఎక్కడో చంపేసి శవం అక్కడ తీసుకెళ్లి విసిరేశారు
హత్యకు గురైన 25 ఏళ్ల యువతి పేరు, వివరాలు ఏమాత్రం చిక్కకుండా హంతకులు జాగ్రతలు పడ్డారని పోలీసు అధికారులు అంటున్నారు. సూట్ కేసులో ఉన్న యువతి ఫోటోలు తీసిన పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. యువతిని వేరే ప్రాంతంలో హత్య చేసిన నిందితులు ఎలాంటి సాక్షాలు చిక్కకుండా సూట్ కేసులో శవం తీసుకువచ్చి తిరుపూర్ లోని రోడ్డు పక్కన విసిరేసి ఉంటారని పోలీసు విచారణ చేస్తున్న అధికారులు అంటున్నారు. మొత్తం మీద 25 ఏళ్ల యువతిని హత్య చేసి శవం సూట్ కేసులో తీసుకెళ్లి విసిరేయడంతో తిరుపూర్ ప్రజలు హడలిపోయారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications