కొట్టించారు: బోరున విలపిస్తూ కూర్చండిపోయిన వైనం
న్యూఢిల్లీ: విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ సోమవారం కంటతటి పెడ్డారు. ఢిల్లీలోని రాంలీల మైదాన్‌లో ఎపిఎన్జీవోల మహాధర్నాకు లగడపాటి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తామిచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేకే తమను సభ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. బిల్లు సభలో పెట్టేందుకు ఇతర రాష్ట్రాల ఎంపీలను వెల్ లోకి పంపించారన్నారు.
సభలో తాము లేకపోతే బిల్లు సజావుగా ఆమోందింపజేసుకోవచ్చనేది వారి ప్రణాళిక అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇవాళ అందరూ ఢిల్లీ వచ్చారన్నారు. అన్ని వర్గాల వారు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని చెప్పారు. ఎపిఎన్జీవోలు ఇరవై రైళ్లు అడిగితే ఏడే ఇచ్చారని, ఎన్నో ఇబ్బందులు ఓర్చుకొని ఎపిఎన్జీలు ఢిల్లీకి వచ్చారన్నారు. బిల్లును అడ్డుకునేందుకు తాము కచ్చితంగా పార్లమెంటులోకి అడుగు పెట్టి తీరుతామన్నారు.

తెలంగాణ బిల్లు పైన కేంద్రం నిర్ణయం గర్హనీయమన్నారు. సభలో మాపై ఇతర రాష్ట్రాల ఎంపీలతో దాడులు చేయించారన్నారు. లగడపాటి మాట్లాడుతూ ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి గురైన కంటతడి పెట్టారు. బోరున విలపిస్తూ అలా కూర్చుండిపోయారు. కాసేపు మాట్లాడలేకపోయారు. ఇది అక్కడున్న ఎపిఎన్జీవోలందర్నీ కదిలించింది.
బిల్లుపై పార్లమెంటులో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. సోనియా, కెసిఆర్‌ల మధ్య విభజన, పార్టీ విలీనం చర్చలు పూర్తయ్యాయన్నారు. బిల్లును బలవంతంగా ప్రవేశ పెట్టేందుకు వెల్లోకి ఇతర రాష్ట్రాల ఎంపీలను పంపించారని ధ్వజమెత్తారు. కొద్ది రోజుల్లోనే తెలంగాణ ప్రక్రియను పూర్తి చేసేందుకు జివోఎం కుట్ర పన్నిందన్నారు 21వ తేదీ లోగా ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తోందన్నారు. కేంద్రమంత్రులు గట్టిగా పోరాడాలన్నారు.












Click it and Unblock the Notifications