రజనీ దాన్ని వ్యతిరేకించాడు: మరో జల్లికట్టు తప్పదంటున్న సినీ వర్గాలు!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను బాదుడుతో థియేటర్ యాజమాన్యాలు దివాళా తీసే పరిస్థితి తలెత్తిందని తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ వర్గాలు గత రెండు రోజులుగా బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమి
ముంబై: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను బాదుడుతో థియేటర్ యాజమాన్యాలు దివాళా తీసే పరిస్థితి తలెత్తిందని తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ వర్గాలు గత రెండు రోజులుగా బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వీరికి మద్దతు తెలిపారు.
జీఎస్టీ అమలుతో ఇప్పటికే..రూ.100లోపు టికెట్లపై 18శాతం, రూ.100కు పైన టికెట్లపై 28శాతం పన్ను అమలులోకి రాగా.. దీనికి తోడు ఇటు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పన్ను పేరిట 30శాతం వినోద పన్ను వసూలు చేయాలని భావిస్తోంది. దీనిపై స్పందించిన రజనీ.. రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను వల్ల పరిశ్రమపై ఆధారపడ్డ లక్షలాది మందికి ఉపాధి కరవవుతుందని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రెండు పన్నుల విధానాన్ని రద్దు చేయాలని కమల్ హాసన్, విశాల్ కార్తీ వంటి పలువురు తమిళ హీరోలు ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, రెండు పన్నుల విధానం వల్ల సినీ పరిశ్రమ ఆదాయానికి భారీగా గండిపడుతుందని వారు వాపోతున్నారు. జీఎస్టీతో పాటు వినోదపు పన్ను కలిపితే రూ.100 టికెట్ పై రూ.50 వరకు ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలకు కలెక్షన్ల వర్షం కురిసినా.. లాభాలు మాటగట్టుకోవడం గగనమే అనేది వారి వాదన.
Keeping in mind the livelihood of Lakhs of people in the tamil film industry, I sincerely request the TN GOVT to seriously consider our plea
— Rajinikanth (@superstarrajini) July 4, 2017
చిన్న థియేటర్లపై 48 శాతం మేర పన్ను అమలవుతుండగా.. ఇంత భారీ స్థాయిలో పన్నులు చెల్లించి తాము థియేటర్లు నడపలేమని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు బిజినెస్ లేక అల్లాడుతున్నాయి. థియేటర్స్ బంద్ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా బుకింగ్స్ నిలిచిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికైనా వినోద పన్ను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే.. మరో జల్లికట్టు తరహా ఉద్యమం తప్పదని సినీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications