Lalbaugcha Raja Visarjan: 32 గంటల తర్వాత లాల్‌బాగ్ చా గణేష్ నిమజ్జనం.. కారణం ఏంటి..?

దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు పూర్తయ్యాయి. 11 రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు. ముంబైలోని ఐకానిక్ లాల్‌ బాగ్ చా గణేష్ కు ఎంతటి పేరుందో మనకు తెలిసిందే. అంబానీ ఫ్యామిలీ క్యూ లైన్ లో వచ్చి ఈ గణపతిని దర్శించుకుంటారు. లాల్‌బాగ్‌ చా రాజా ముంబైలోనే కాకుండా భారత్ లోనే అత్యంత ప్రసిద్ధమైన గణపతి విగ్రహాలలో ఒకటిగా నిలుస్తూ వస్తోంది.

ఈ గణేష్ కు ఏటా 11 రోజుల పాటు కన్నుల పండగలా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ రెండు సార్లు హారతి ఇస్తారు. ఈ గణనాథుడిని దర్శించుకోవాలంటే 24 గంటలకుపైగానే పడుతుంది. ఒక్కోసారి 2 రోజుల సమయం కూడా పడుతుంది. అయినా భక్తులు దేశం నలుమూలల నుంచి వచ్చి ఈ గణపయ్యను దర్శించుకుంటారు. అంతటి మహిమాన్వితమైన ప్రదేశంగా లాల్‌బాగ్ చా గణేష్ కు పేరుంది.

అయితే లాల్‌బాగ్ చా గణేష్ నిమజ్జనం కూడా ఓ వేడుకగా నిర్వహిస్తారు. ఈ వేడుకలు ప్రతి సారీ న భూతో న భవిష్యతి అన్నట్లుగా జరుగుతాయి. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన వీడియోలు చూస్తే రెండు కళ్లు చాలవు. అంత అద్భుతంగా గణేష్ నిమజ్జనం నిర్వహిస్తారు. ఇక లాల్‌బాగ్ చా గణపతి నిమజ్జనం ఆదివారం రాత్రి 9.15గంటల సమయంలో పూర్తయింది. అయితే నిర్దేశించిన సమయానికి చాలా లేట్ గా ఈసారి లాల్‌బాగ్ చా గణేష్ నిమజ్జనం జరిగింది. దాదాపు 13 గంటల ఆలస్యంగా నిమజ్జనం జరిగింది. ఊరేగింపు మొదలైనప్పటి నుంచి చూస్తే 32 గంటల తర్వాత మహాగణపతి నిమజ్జనం పూర్తికావడం గమనార్హం.

Lalbagh Cha Ganesh Immersion Delayed by 13 Hours Devotees Await Closure

లాల్‌బాగ్ చా గణేష్ నిమజ్జనంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12.30 కు లాల్‌బాగ్ చా రాజా ఊరేగింపు ప్రారంభం అయింది. ఆదివారం ఉదయం 8గంటలకు గిర్‌ గావ్‌ చౌపటీ బీచ్‌ కు చేరుకుంది. గణనాథుడిని నిమజ్జనం చేసే సమయంలో అరేబియా సముద్రంలో ఆటుపోట్లు ప్రారంభం కావడం ఇబ్బందిగా మారింది. సముద్రంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఆటుపోట్లు తగ్గేవరకు వేచిచూడాలని నిర్వాహకులు నిర్ణయించారు. అలా చివరికి ప్రత్యేక పూజల అనంతరం రాత్రి 9.35గంటలకు నిమజ్జనం పూర్తిచేశారు.

అయితే దీనిపై మిక్స్ డ్ కామెంట్స్ వస్తున్నాయి. సనాతన ధర్మం ప్రకారం అనుకున్న సమయంలోనే లాల్‌బాగ్ చా గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని.. ఆలస్యం చేశారని కొందరు సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై మతపెద్దలు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+