లలిత్ మోడీ గెలిచాడు: సుప్రీంకు బిసిసిఐ స్పష్టం
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల ఫలితాలను సుప్రీంకోర్టు తెరవక ముందే లలిత్ మోడీ గెలిచాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) తెలిపింది. ఫలితాలను అధికారికంగా ప్రకటించవద్దనే విషయంపై వాడివేడిగా వాదనలు జరుగుతున్న నేపథ్యంలోనే బిసిసిఐ ఆ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది.
రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో 33 ఓట్లలో లలిత్ మోడీకి 26 ఓట్లు వచ్చాయని చెప్పింది. ఐపియల్ కుంభకోణం నేపథ్యంలో నిషేధం విధించినందువల్ల లలిత్ మోడీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండింది కాదని చెప్పింది.

ఫలితాల సీల్డ్ కవర్‌ను తెరవడానికి సుప్రీంకోర్టు సన్నద్ధమవుతున్న స్థితిలో మోడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గల అర్హతపై వాడిగా వాదనలు జరుగుతున్న సమయంలో దాన్ని మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.
మోడీపై నిషేధం ఉన్నందువల్ల రాజస్థాన్ క్రికెట్ సంఘం యాజమాన్యంలోకి మోడీ వస్తే ఆ సంఘాన్ని సస్పెండ్ చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని బిసిసిఐ వాదించింది. రాజస్థాన్ క్రికెట్ సంఘాన్ని సస్పెండ్ చేస్తే భారత జట్టులో ఉన్న ఇద్దరు ఆటగాళ్లను వెనక్కి పిలువాల్సి వస్తుదని బిసిసిఐ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications