వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ లిఫ్ట్‌లు చిన్నవి, లావుగా ఉంటే: షాపై లాలూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా పైన ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం నాడు సెటైర్లు వేశారు. బీహార్ లిఫ్ట్‌లు చాలా చిన్నవని, అమిత్ షా వంటి లావువాళ్లను అవి మోయలేవన్నారు.

బీహార్ లిఫ్టులు వాటిలో భారీ కాయం కలిగిన వ్యక్తులు ఎక్కరాదని వ్యంగ్యాస్త్తాలు విసిరారు. అమిత్ షా లావుగా ఉన్నందునే లిఫ్ట్ ఆగిపోయిందన్నారు. అధిక బరువు ఉన్న వ్యక్తులు లిఫ్ట్ ఎక్కకపోవడమే మంచిదన్నారు.

లాలూ వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సర్కారు నిర్లక్ష్యం కారణంగానే లిఫ్టు ఘటన చోటుచేసుకుందని బీజేపీ నేతలు ఎదురు దాడికి దిగారు.

Lalu Prasad has an advice for Amit Shah who got stuck in a lift

కాగా, బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమం నిమిత్తం అమిత్ షా గురువారం పాట్నా వచ్చారు. ఆ రాష్ట్ర అతిథి గృహాంలో గురువారం రాత్రి కార్యక్రమం ఉండటంతో అమిత్ అక్కడికి చేరుకున్నారు.

అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తులోకి అమిత్ షా లిఫ్ట్‌లో వెళ్తుండగా లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో అమిత్ షాతో పాటు మరో ముగ్గురు నేతలు అరగంటకు పైగా లిఫ్ట్‌లోనే ఉండిపోయారు. ఇక ఎట్టకేలకు అమిత్ షా భద్రతా సిబ్బంది లిఫ్ట్ తలపులను పగులగొట్టారు.

దీంతో సురక్షితంగా అమిత్ షాతో పాటు మరో ముగ్గురు నేతలు బయటపడ్డారు. దీంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్ట్ ఆగిపోయిన సమయంలో అక్కడ లిఫ్ట్ ఆపరేటర్ లేకపోవడంతో నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

English summary
After mimicking Prime Minister Narendra Modi during a speech, the Bihar strongman has now described Modi's lieutenant Amit Shah as a fat man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X