లాలూ 68: ఇంటికొచ్చిన సీఎం నితీశ్ (ఫోటోలు)
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం ఘనంగా 68వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకులకు ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వయంగా లాలూ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నేరుగా లాలూ ఇంటికి వచ్చిన నితీశ్ కుమార్ పూలబొకే అందించి, శుభాకాంక్షలు తెలపడం విశేషం.
ఈ సందర్భంగా లాలు ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ త్వరలో బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు తాను పూర్తి సన్నద్ధంగా ఉన్నానని చెప్పారు. తనకు ఇప్పటికీ కుర్రాళ్లకు ఉన్నట్లే శక్తి సామర్థ్యాలున్నాయని, గత సంవత్సరం తనకు గుండెకు ఆపరేషన్ జరిగినా తన శక్తియుక్తులు ఏమాత్రం తగ్గలేదని లాలూ చెప్పారు.
ఈ ఏడాది జరగనున్న బీహార్ ఎన్నికల్లో రెండు రోజుల క్రితం ఆర్జేడీ, జేడీయూ పార్టీలు కలిసి జనతా పరివార్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే. బీహార్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నితీశ్ కుమార్ పేరు ప్రకటించిన తర్వాత వీరిద్దరూ కలవడం ఇదే మొదటిసారి.
ఈ సందర్భంగా నితీశ్ కుమార్ మాట్లాడుతూ 'మేం రాజకీయ నాయకులం, రాజకీయాలు మాట్లాడుతాం. అయితే ఈరోజు లాలూజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని వ్యక్తిగతంగా విష్ చేసేందుకు వచ్చాను' అని చెప్పారు. లాలూ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్జేడీ కార్యకర్తలు ఆయన ఇంటికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఘనంగా లాలూ 68వ పుట్టినరోజు
ఈ పుట్టినరోజు వేడుకులకు ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వయంగా లాలూ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. నేరుగా లాలూ ఇంటికి వచ్చిన నితీశ్ కుమార్ పూలబొకే అందించి, శుభాకాంక్షలు తెలపడం విశేషం.

ఘనంగా లాలూ 68వ పుట్టినరోజు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం ఘనంగా 68వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. కేక్ కట్ చేస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్. పక్కనే లాలూ భార్య రబ్రీదేవి.

ఘనంగా లాలూ 68వ పుట్టినరోజు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం ఘనంగా 68వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. కట్ చేసిన కేక్‌ను తన భార్య రబ్రీదేవికి తినిపిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్.

ఘనంగా లాలూ 68వ పుట్టినరోజు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం ఘనంగా 68వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. లాలూ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్జేడీ కార్యకర్తలు ఆయన ఇంటికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.












Click it and Unblock the Notifications