ఆర్ఎస్ఎస్ పై లాలూ సెటైర్స్ : రబ్రీదేవి చెప్పినందుకే 'ప్యాంట్లు'
పాట్నా : ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. హాఫ్ ప్యాంట్ నుంచి ఫుల్ ప్యాంట్ కు మారిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. కాగా, దసరా నుంచే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలంతా నిక్కర్ల నుంచి ప్యాంట్లకు మారిన సంగతి తెలిసిందే.
ఆర్ఎస్ఎస్ స్థాపించిన నాటి నుంచి డ్రెస్ కోడ్ లో మార్పులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంతకీ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన కామెంట్స్ ఏంటంటే.. తన భార్య రబ్రీదేవి సూచన మేరకే ఆర్ఎస్ఎస్ వాళ్లు యూనిఫాం మార్చుకున్నారన్నారు లాలూ. ఆర్ఎస్ఎస్ వాళ్లు పట్టపగలు కూడా నిస్సిగ్గుగా నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారని రబ్రీదేవి విమర్శించారని అందుకే ఆర్ఎస్ఎస్ వాళ్లంతా ప్యాంట్లకు మారారని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
अभी तो हमने हाफ को फुल पेंट करवाया है
— Lalu Prasad Yadav (@laluprasadrjd) October 11, 2016
माइंड को भी फुल करवायेंगे
पैंट ही नहीं सोच भी बदलवायेंगे
हथियार भी डलवायेंगे
जहर नही फ़ैलाने देंगे।। pic.twitter.com/LAIUV6dRYA
'ఇప్పుడు మేం హాఫ్ ప్యాంట్లను ఫుల్ చేయించుకున్నాం.. మైండ్ కూడా ఫుల్ చేయించుకుంటాం.. ప్యాంట్లే కాదు ఆలోచనలు కూడా మార్చుకుంటాం.. ఆయుధాలు పక్కనపెడుతాం.. విషయం వ్యాపించినవ్వం 'అంటూ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు లాలూ.












Click it and Unblock the Notifications