ఎగ్జిట్ పోల్స్ తప్పవుతాయి: ముందే ఊహించిన లాలూ (ట్వీట్)
న్యూఢిల్లీ: "గుర్తుంచుకోండి... బీహార్లో ఎన్నికల అనంతరం అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువైంది. వాస్తవ ఫలితాలకు ఏ ఒక్క సంస్థ కూడా కనీసం దగ్గరకు రాలేకపోయింది. నిశ్శబ్ధంగా, 19వ తేదీ వరకూ వేచి చూడండి" సరిగ్గా రెండు రోజుల క్రితం బీహార్ రాజధాని పాట్నాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
Gentle reminder & reality of Bihar Exit Polls. None was close to original outcome..Relax, Keep calm & wait for 19th pic.twitter.com/MiDbutqOuQ
— Lalu Prasad Yadav (@laluprasadrjd) 16 May 2016
బీహార్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఎలాగైతే తప్పు అయ్యాయో, తమిళనాడులో అదే జరగవచ్చని ఆర్జేడీ అధినేత లాలూ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా ఇప్పుడు నిజమయ్యాయి. పోలింగ్ రోజున వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆమెకు వ్యతిరేకంగా రావడంతో ఆమె ఇంటికి పరిమితమయ్యారు.
జాతీయ ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కూడా అమ్మను ఇంటికి పంపించి కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ గురువారం వెల్లడైన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ తప్పుని తేలాయి.

ఒక్క టైమ్స్ నౌ - సీఓటర్స్, తమిళనాడులోని లోకల్ చానళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా జయలలిత తిరిగి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ నాడు వర్షం తగ్గిన తరువాత మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకోవడం అన్నాడీఎంకేకు కలిసివచ్చిందని సీఓటర్స్ విశ్లేషించింది.
మైలేజీ ఎక్కడ తగ్గింది?: ఓటర్లు కరుణ చూపిన సీఎం పీఠానికి కరుణానిధి దూరం సరిగ్గా అదేవిధంగా ఈరోజు వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే పార్టీ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. సాధారణంగా తమిళనాడులో ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ఈసారి జయలలిత ఆ సంప్రదాయాన్ని తిరగరాసారు. తమిళనాడులో అన్నాడీఎంకే చీఫ్ జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు.
ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ప్రధాని నరేంద్రమోడీ జయలలితకు స్వయంగా ఫోన్ చేసి ఆమెతో మాట్లాడారు. దీంతో ప్రధాని అభినందనలను స్వీకరించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని పార్టీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 1984 తర్వాత అంటే, 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి ఒక ముఖ్యమంత్రి అధికారం చేపట్టడం ఇదే మొదటిసారి.












Click it and Unblock the Notifications