టిపై కెసిఆర్‌కు లాలూ హామీ: 1969 నుండే: పాశ్వాన్

ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు, నాయకుల మద్దతు కూడగట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన లాలూను కలిశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని కెసిఆర్, ఇతర తెరాస నేతలు కోరారు. దానికి లాలూ అంగీకరించారు.
ఈ సందర్భంగా లాలూ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వెంటనే నెరవేర్చాలని లాలూ కోరారు. తెలంగాణ ఏర్పాటుకు తాము పూర్తిగా అనుకూలమని చెప్పారు. లోకసభ, రాజ్యసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి ఆర్జెడి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని కోరుతున్నానని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడిన ప్రాంతమన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను వెంటనే నెరవేర్చవలసి ఉందని లాలూ అభిప్రాయపడ్డారు. అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు తాను నేతలను కలుస్తున్నానని చెప్పారు. మద్దతు తెలిపినందుకు తెలంగాణ ప్రజల తరఫున తాను లాలూకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
ఆ తర్వాత కెసిఆర్ రామ్ విలాస్ పాశ్వాన్‌ను కలువనున్నారు. ఈ సందర్భంగా పాశ్వాన్ మాట్లాడుతూ.. తెలంగాణకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. తాను 1969 నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తున్నానని చెప్పారు. ఇందుకోసం ఇతర పార్టీల మద్దతు కూడా కూడగడుతానని అన్నారు.












Click it and Unblock the Notifications