కౌగిలించుకుంది నేను కాదు, లాలూనే: కేజ్రీవాల్ వివరణ
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కౌగిలించుకున్న నేపథ్యంలో అవినీతిని కౌగిలించుకున్నారంటూ వస్తున్న విమర్శలపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ వింతగా స్పందించారు. లాలూని తాను కౌగిలించుకోలేదని చెప్పిన కేజ్రివాల్.. లాలూనే వేదికపైకి లాగి తనను కౌగిలించుకున్నారని వివరణ ఇచ్చారు.
తనకు అతడ్ని కౌగిలించుకోవాలని లేకపోయినా అది జరిగిపోయిందని ఆప్ జాతీయ కౌన్సిల్ సమావేశంలో కేజ్రివాల్ చెప్పారు. ‘నితీష్ బీహార్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో లాలూ స్టేజీపై ఉన్నారు. నాతో చేతులు కలిపి అతనే కౌగిలించుకున్నాడు. అతనే నా చేతులు కూడా లేపి అభివాదం చేయించారు' అని కేజ్రీవాల్ వివరించారు.
‘దీన్నే భూతద్దంలో పెట్టి చూస్తూ ప్రశ్నిస్తున్నారు. తాము ఆర్జేడీతో కలిసి ఏ కూటమిని ఏర్పాటు చేయలేదు' అని కేజ్రీవాల్ తెలిపారు. తాము అతని(లాలూ) అవినీతి చరిత్రకు వ్యతిరేకమే, ఎప్పుడూ దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు.

‘మేము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. లాలూ ఇద్దరు కుమారులు ఇప్పుడు మంత్రులయ్యారు. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం' అని కేజ్రీవాల్ తెలిపారు. కాగా, ఇప్పుడు లాలూను కౌగిలించుకోవడంతోపాటు కేజ్రీవాల్ స్పందనపైనా విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కేజ్రీవాల్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు.
‘నన్ను ప్రశ్నిస్తున్నందుకు ఆనందంగా ఉంది. తమ పార్టీపై నమ్మకమున్నందువల్లే ప్రజలు ప్రశ్నిస్తున్నారు' అని కేజ్రీవాల్ అన్నారు. లాలూను ఏ ఇతర నాయకుడు కౌగిలించుకున్నా.. ఇలాంటి ప్రశ్నలు వచ్చేవి కాదని చెప్పారు. ఇది మాకు మంచే చేస్తుందని కేజ్రీవాల్ అన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు మద్దతివ్వడంపై కేజ్రీవాల్ సమర్థించుకున్నారు. ‘నేను బీహార్ వెళ్లా. నితీష్ కుమార్ మంచి వ్యక్తి. నితీష్ పాలన బాగుందని ప్రజలు చెప్పారు. మేము బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం కాబట్టి, నితీష్‌కు మద్దతు తెలిపాం' అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
ఇది ఇలా ఉండగా, అరవింద్ కేజ్రీవాల్‌పై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన పార్టీ అని చెప్పుకోవడం ఇక చరిత్రేనని పేర్కొంది. అవినీతికి పాల్పడిన లాలూను కౌగిలించుకున్న కేజ్రీవాల్.. తను చేసిన అవినీతిపై పోరాటం ముగిసిందని చాటి చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications