Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2019 ఎన్నికల్లో పోటీకి ఐశ్వర్యరాయ్ రెడీ, చాప్రా నుండి పోటీ

చెన్నై:ఆర్జేడీ నాయకుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ సతీమణి ఐశ్వర్యరాయ్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా అనే విషయమై చర్చ సాగుతోంది. బీహర్ రాష్ట్రంలోని చాప్రా అసెంబ్లీ నియోజకవర్గం నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ సతీమణి ఐశ్యర్యరాయ్ పోటీ చేసే విషయమై ఆర్జేడీ చీఫ్ లాలూ‌ప్రసాద్ యాదవ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.

ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ సతీమణి ఐశ్వర్యరాయ్ బీహర్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ యాదవ్ మనమరాలు. తేజ్ ప్రతాప్ యాదవ్ తో ఐశ్వర్యరాయ్ వివాహం మే 12వ తేదిన పాట్నాలో జరిగింది. ఈ వివాహం కోసం ప్రత్యేకంగా బెయిల్ పై లాలూ జైలు నుండి వచ్చాడు.

ఐశ్యర్యరాయ్ చాప్రా నియోజకవర్గానికి చెందింది. ఈ నియోజకవర్గం నుండి చాప్రా నుండి పోటీ చేస్తే బాగుంటుందని ఆర్జేడీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయమై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు.

Lalus daughter-in-law Aishwarya Rai may contest 2019 Lok Sabha elections

అయితే ఈ విషయమై ఆర్జేడీ నిర్ణయం తీసుకోకపోయినా ఆర్డేడీపై జెడియూ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్జేడీ కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేసినా కానీ వారికి కాదని లాలూ తన కుటుంబం కోసం టిక్కెట్లను కేటాయించుకొంటుందని జెడియూ నేతలు విమర్శిస్తున్నారు.

ఐశ్వర్యరాయ్ కూడ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చింది.దీంతో ఐశ్యర్యారాయ్ ను ఎన్నికల బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+