రెప్పపాటులో ఘోరం: నోయిడా హైవేపై అనూహ్య ప్రమాదం, పల్టీలు కొట్టిన కారు..
ముందు వేగంగా దూసుకెళ్తున్న లంబోర్గిని కారును స్విస్ట్ డిజైర్ కారు అతి సమీపం నుంచి ఓవర్ టేక్ చేసింది.దాంతో లంబోర్గిని డ్రైవర్ కారును ఒక్కసారిగా కాస్త ఎడమ పక్కగా తిప్పాడు.
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడా రహదారిపై రెప్పపాటులో భారీ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లంబోర్గిని కారును.. అతి సమీపం నుంచి ఓ స్విస్ట్ డిజైర్ కారు ఓవర్ టేక్ చేయడంతో.. వెనకాలే వస్తున్న మరో మారుతి ఎకో కారు అనూహ్యంగా ప్రమాదానికి గురైంది.
ఢిల్లీకి సమీపంలోని నోయిడా సెక్టార్ 135వద్ద ఈ ప్రమాద ఘటన జరిగింది. ముందు వేగంగా దూసుకెళ్తున్న లంబోర్గిని కారును స్విస్ట్ డిజైర్ కారు అతి సమీపం నుంచి ఓవర్ టేక్ చేసింది. దాంతో లంబోర్గిని డ్రైవర్ కారును ఒక్కసారిగా కాస్త ఎడమ పక్కగా తిప్పాడు. ఈ అనూహ్య పరిణామానికి అప్పటికే అదే లైన్ లో వేగంగా దూసుకొస్తున్న మారుతీ ఎకో ప్రమాదానికి గురైంది.

లంబోర్గిని కారును ఢీకొట్టి పల్టీలు కొడుతూ.. రోడ్డు పక్క అడవి పొదల్లో పడిపోయింది. ప్రమాదంలో మారుతీ ఎకోను డ్రైవ్ చేస్తున్న 20ఏళ్ల యువకుడు అక్కడిక్కడే చనిపోయాడు. స్విఫ్ట్ కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేయగా.. లంబోర్గిని డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. సీసీటీవి కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డవడంతో.. ప్రస్తుతం ఆ దృశ్యాలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications