వామ్మో.. రాజు ఏం పని ఇదీ.. చూడడానికే కోతి కానీ.. మందు తాగడం ఏంటీ.. చేజేతులా
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.. పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి. అయినా కొందరు మాత్రం మత్తులో జోగుతుంటారు. మానవులకు సంబంధించి ఇదీ కామన్.. అయితే జంతువులకు వచ్చేసరికి ఇబ్బందే.. అవును జంతువులు లిక్కర్ ఎక్కడ తాగుతాయనే కదా సందేహాం.. అయితే ఈ స్టోరీ చదవండి. అదీ కూడా ఓ ముచ్చ కోతి మందు తాగి.. ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంది.
కర్ణాటకలో విచిత్రం జరిగింది. అవును ఓ లంగర్ (ముచ్చ కోతి) మందుకు బానిస అయ్యింది. అవును ఆ కోతి వయస్సు..21 ఏళ్లు కాగా.. మద్యం లేకుండా ఉండలేకపోయింది. అలా లిక్కర్ తీసుకుంటూ చనిపోయింది. పిలికులా బయోలాజికల్ పార్క్ వద్ద ఆదివారం తుది శ్వాస విడిచింది. లంగర్లను హనుమాన్ లంగర్.. ముచ్చకోతి అని అంటారు. అయితే దానికి పోస్టుమార్టం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాని కిడ్నీ, లివర్ కూడా చెడిపోయిందని తెలిసింది. ఆ రెండు కీలక అవయవాలు పనితీరుపై ప్రభావం పడిందని వైద్యులు వివరించారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.
ఆ లంగర్ (ముచ్చ కోతి) పేరు రాజు.. దానిని 2005లో పడుబిద్రీ పట్టణంలో కొందరు కాపాడారు. అయితే అప్పటికే దాని ఆరోగ్యం క్షీణించింది. దానికి వైద్యులు చికిత్స అందించారు. వైద్యులు ఆహారం అందజేసిన తిరస్కరించారు. దీంతో కొంచెం మోతాదులో మద్యం అందించామని పార్క్ డైరెక్టర్ చెప్పారు. దాని ఆరోగ్యం కోలుకున్నాక.. మద్యం అందజేయడం పూర్తిగా మానేశామని తెలియజేశారు. తర్వాత పండ్లు, వైరెటీ ఫుడ్ తీసుకోవడం ప్రారంభించింది.
Recommended Video
కిడ్నీ లివర్ ఫంక్షన్‌పై ప్రభావం చూపి రాజు చనిపోయాడు. అయితే పోస్టుమార్టం రిపోర్టును తదుపరి స్టడీ కోసం.. బెంగళూరు పంపించారు. లంగర్లు 18 నుంచి 20 ఏళ్లు జీవిస్తాయని నిపుణులు తెలియజేశారు. కానీ ఇదీ 21 ఏళ్లు జీవించింది. ఇటు రాజుకు.. జనం మాదిరిగానే అంత్యక్రియలను నిర్వహించారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా లంగర్లకు అంత్యక్రియలను నిర్వహించారు.