మోడీని ప్రధానిగా చూడాలనుకుంటున్న లతా (పిక్చర్స్)
ముంబై: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలని ఉందని ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ శుక్రవారం అన్నారు. పుణేలో తన తండ్రి దీననాథ్ మంగేష్కర్ పేరిట నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కొత్త భవన సముదాయాన్ని మోడీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా 84 ఏళ్ల లతా మంగేష్కర్ మాట్లాడారు. మోడీని ప్రధానిగా చూడాలనుకుంటున్నానని చెప్పారు. దీపావళి పర్వదినం సందర్భంగా మన ఆకాంక్ష నిజం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. మోడీ తనకు సోదరుడి లాంటి వారన్నారు.
అనంతరం మోడీ మాట్లాడుతూ... తన అద్భుతమైన గళంతో కోట్లాది మందిని మంగేష్కర్ అలరించారన్నారు. కాగా, మోడీపై మంగేష్కర్ వ్యాఖ్యలపై కాంగ్రెసు నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. లతా పొగడటం వ్యక్తిగతమన్నారు. లతా అంటే అందరికీ గౌరవమేనని, అది ఆమె దోషం కాదని, మోడీ చాలామందిని తప్పుదారి పట్టించారన్నారు.

మోడీ అండ్ లతా
పుణేలో దీననాథ్ మెగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కొత్త భవన సముదాయాన్ని ప్రారంభించిన సమయంలో లతా మంగేష్కర్‌కు మోడీ నమస్కారం.

మోడీ జ్వోతి ప్రజ్వలన
పుణేలో దీననాథ్ మెగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కొత్త భవన సముదాయాన్ని ప్రారంభించిన సమయంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మోడీ.

మనీష్ తివారీ
బ్రాడ్ కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి మనీష్ తివారీ చేతుల మీదుగా అక్టోబరులో అవార్డు తీసుకుంటున్న లతా మంగేష్కర్.

మోడీ
భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దీననాథ్ మంగేష్కర్ సుపర్ స్పెషాలిటీని ప్రారంభిస్తున్న దృశ్యం. పక్కన లతా మంగేష్కర్.

తోబుట్టువులతో లతా
లతా మంగేష్కర్ తోబుట్టువులతో... ఎడమ వైపు నుండి ఉషా, ఆశా, మీనా, హృదయనాథ్. దీననాథ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నవంబర్ 1న ప్రారంభించారు.












Click it and Unblock the Notifications