నటి ప్రత్యూష కేసు: నిందితుడిపై మరో లైంగిక వేధింపుల కేసు
ముంబై: బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన రాహుల్ రాజ్ సింగ్‌పై, అతని స్నేహితురాలిపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి రాహుల్ తన స్నేహితురాలు కలిసి ఓ దక్షిణాది నటిని ముంబైలోని ఓ హోటల్‌లో వేధించారు. ఈ ఘటన హోటల్‌లోని సీసీటీవీలో రికార్డ్ అవడంతో పోలీసులు రాహుల్‌తో పాటు అతని స్నేహితురాలిపై కేసు నమోదు చేశారు.
కాగా, రాహుల్ మద్యం సేవించి అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో హోటల్‌కు వచ్చాడని అప్పుడే తన స్నేహితుడితో కలిసి హోటల్ రూంలోకి వెళుతుంటే రాహుల్ తమని చూసి గొడవపడి తన స్నేహితుడిని కొట్టాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. గొడవను ఆపబోయిన తననూ రాహుల్, అతని స్నేహితురాలు కలిసి నోటికొచ్చినట్లు తిట్టి చేయిచేసుకున్నట్లు చెప్పింది.

అంతేగాక, 'నీలాంటి ఆడవాళ్లను ఎంతో మందిని చూశాను. ప్రత్యూష కేసులోనే పోలీసులు నన్ను ఏమీ చేయలేకపోయారు. ఇక నువ్వెంత' అంటూ బెదిరించాడని పేర్కొంది. రాహుల్ ఓ ప్రాజెక్ట్ కోసం కొన్ని వారాల క్రితం ఒక నిర్మాతని కలవడానికి అంధేరీకి వచ్చాడు. అప్పటికే నిర్మాత వేరే ప్రాజెక్ట్‌పై బిజీగా ఉండడంతో రాహుల్‌ని తర్వాత వచ్చి కలవమన్నాడు.
రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోకుండా నిర్మాత ఆఫీస్‌లోనే పొగతాగుతూ ఆయనతో గొడవపెట్టుకున్నాడు. ఆ నిర్మాతపై కోపంతో రాహుల్.. ఆ యువతిపై ఆమె స్నేహితుడిపై చేయిచేసుకున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం రాహుల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజ్ చూశాక విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications