అట్నుంచి నరుక్కొస్తోన్న రజినీకాంత్.. !!

తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో టీవీకే అధికారంలోకి వచ్చిన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. అన్నామలై భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి.. ఓ సామాజిక ఉద్యమ సంస్థను ప్రారంభించిన కొన్ని గంటల్లోనే సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్ తెరమీదికి వచ్చారు. ఇది.. తమిళనాడు రాజకీయాల్లో రసవత్తర మలుపునకు దారి తీసినట్టయింది.

కొత్తగా 'మక్కల్ మేడై' (ప్రజా వేదిక) పేరుతో ఒక సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించారు లతా రజినీకాంత్. సమాజంలో సానుకూల మార్పు కోరుకునే ప్రజలందరూ ఈ వేదికలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. అందరం కలిసి ఒక బలమైన శక్తిగా ఏర్పడి, సమాజ హితం కోసం సత్కార్యాలు చేయడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ ఉద్యమ ప్రయాణంలో భాగస్వాములు కావడానికి అనుభవజ్ఞులను లత ఆహ్వానించారు.

Latha Rajinikanth launches Makkal Medai invites all to drive positive social change grassroots

ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజన్లు, మేధావులు తమ అనుభవాలను అందించాలని కోరారు. స్థానిక స్థాయిల్లో నాయకత్వాన్ని తయారు చేయడమే కాకుండా, తమ నియోజకవర్గాల అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేయాలని లతా రజినీకాంత్ ఆకాంక్షించారు. ఈ సామాజిక వేదికలో చేరడానికి ఆసక్తి ఉన్నవారు 7550080515 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా [email protected] అనే ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని ఆమె ప్రకటించారు.

నిర్మాణాత్మకమైన పనుల కోసం అందరూ సంఘటితంగా రావాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ముందుకు సాగాలని ఆమె కోరారు. చెన్నై కేంద్రంగా మక్కల్ మేడై కార్యకలాపాలను చేపడుతుందని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికీ దీన్ని విస్తరించాలనేది తన అభిమతమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం కష్టపడాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మక్కల్ మేడైలో చేరాలని సూచించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ భార్యగా లతా రజనీకాంత్ సుపరిచితురాలు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. 1958 మార్చి 2న చెన్నైలో జన్మించారు. ఆమె అసలు పేరు లతా రంగాచారి. ఎతిరాజ్ ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేశారు. ప్రముఖ నటుడు వైజీ మహేంద్రన్ సమీప బంధువు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఆమెకు సోదరుని కుమారుడే. 1981 ఫిబ్రవరి 26న తిరుపతిలో రజినీకాంత్ ను పెళ్లాడారు. రజినీకాంత్ దంపతులకు ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సినిమాల్లో పలు పాటలు పాడారామె. 'టిక్ టిక్ టిక్', 'అన్బుళ్ళ రజనీకాంత్', 'వల్లి', 'కొచ్చడయాన్' వంటి చిత్రాల్లో పాటలు పాడారు. అంతేకాకుండా, సామాజిక బాధ్యతలో భాగంగా 'శ్రీ దయా ఫౌండేషన్', 'పీస్ ఫర్ చిల్డ్రన్' వంటి సంస్థల ద్వారా బాలల హక్కుల పరిరక్షణకు, సమాజ అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు 'makkal meddai' ద్వారా తన సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు సిద్ధమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+