గాలి కుమార్తె పెళ్లిలో ముత్యాలతో (వీడియో)
బెంగళూరు: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి, రాజీవ్ రెడ్డిల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరు ప్యాలెస్ మైదానంలో అట్టహాసంగా గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి జరిగింది.
ఈ శుభకార్యంలో గాలి బ్రహ్మిణి, రాజీవ్ రెడ్డి కుటుంబ సభ్యులు బంధు మిత్రుల సమక్షంలో ఒకరి మీద ఒకరు ముత్యాలతో తలంబ్రాలు పోసుకుని ఎంజాయ్ చేశారు. వధూవరుల పక్కనే గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు, విక్రమ్ దేవ్ రెడ్డి కుటుంబ సభ్యులు కుర్చున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, బళ్లారి ఎంపీ శ్రీరాములు అతిథులను పలకరిస్తూ వారి దగ్గర నవ దంపతుల మీద అక్షింతలు వేయించారు. పలువురు నాయకులు వధూవరులను ఆశిర్వదించారు. మొత్తం మీద ఈ వీడియో చూస్తే గాలి కుమార్తె పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో మీకే అర్థం అవుతుంది.












Click it and Unblock the Notifications