గాలి కుమార్తె పెళ్లి: ఆ నటుడికి చుక్కలు చూపిస్తారా ?
బెంగళూరు: గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సహాయపడిన ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు చెందిన వారిని విచారించడానికి ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు సిద్దం అయ్యారని సమాచారం.
ఓ ప్రముఖ నటుడు ఆ ఈ వెంట్ మేనేజ్ మెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించారని అధికారులు అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న ఆ బహుబాష నటుడే పెళ్లి వెడ్డింగ్ కార్డు ను తయారు చేయించారని అధికారులు వివరాలు సేకరించారు.

ఆనటుడి సోదరుడు సైతం బెంగళూరులో నివాసం ఉంటున్నారని, వారిద్దరూ కలిసి ఓ టీం ఏర్పాటు చేసుకుని గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహాం ఎలా చెయ్యాలి ? అని పక్కా ప్లాన్ చేశారని అధికారులు అంటున్నారు.
గాలి కుమార్తె పెళ్లికి నవంబర్ 8వ తేదీ (పెద్ద నోట్లు రద్దు అయిన రోజు) తరువాత ఎలా నగదు సమకూర్చారు, అంతకు ముందే డబ్బు తీసుకుని ఉంటే ఎంత డబ్బు ఇచ్చారు అని ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇచ్చారా ? అనిపూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
గాలి కుమార్తె పెళ్లి విషయంలో కీలకపాత్ర పోషించిన ఆ నటుడు ఎవరో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. అయితే అధికారులు మాత్రం ఆనటుడి నుంచి వివరాలు సేకరించడానికి అన్నీ సిద్దం చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications