చెప్పేదేం లేదు: నటి కేసుపై సదానంద, కార్తీక్‌కు ఊరట
న్యూఢిల్లీ/బెంగళూరు: తన తనయుడు కార్తీక్ గౌడ పైన నటి, మోడల్ మైత్రేయ ఫిర్యాదు విషయమై కేంద్రమంత్రి సదానంద గౌడ సోమవారం స్పందించారు. ఆయన ఢిల్లీలో మాట్లాడారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను పలుమార్లు చెప్పానని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇంతకుముంది నేను చెప్పేందుకు ఏమీ లేదన్నారు.
వంద రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో తన శాఖ గురించి సదానంద సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా తన తనయుడి విషయమై విలేకరులు అడిగినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు.

ముందస్తు బెయిల్
నటి, మోడల్ మైత్రేయ కేసులో కేంద్ర రైల్వే శాఖమంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడకు సోమవారం ముందస్తు బెయిల్ వచ్చింది. బెంగళూరు సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.
కాగా, నటి, మోడల్, మైత్రేయ.. కార్తీక్ గౌడ పైన పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు దీని పైన విచారణ జరుపుతున్నారు. సదానంద గౌడకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications