ఆ హీరో సినిమాలు మొత్తం బ్యాన్ చెయ్యాలని లాయర్ల డిమాండ్, హీరో ప్రభావం ఉంది !
బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాయి. ఇప్పుడు అనేక కట్టుదిట్టమైన నియమాలు అమల్లోకి వస్తున్నాయి. కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హీరో కిచ్చా సుదీప్ ప్రకటించారు. హీరో సుదీప్ నటించిన సినిమాలు మొత్తం బ్యాన్ చెయ్యాలని లాయర్లు ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల డేట్ ప్రకటించిన తరువాత కన్నడ స్టార్ హీరోలు కిచ్చా సుదీప్, చాలెంజింగ్ స్టార్ దర్శన్ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో కలిసి కిచ్చా సుదీప్ మాత్రమే బుధవారం మీడియా ముందుకు వచ్చారు. తాను బసవరాజ్ బోమ్మయ్ మామకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని హీరో సుదీప్ అన్నారు.

కర్ణాటక మొత్తం తిరిగి తాను బీజేపీ నాయకులకు మద్దతుగా ప్రచారం చెయ్యలేనని, బోమ్మయ్ మామ ఎవరికి ప్రచారం చెయ్యమంటే వారికి మాత్రమే ప్రచారం చేస్తానని హీరో కిచ్చా సుదీప్ వివరించారు. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీకి స్టార్ ప్రచారకర్తగా మారిపోయారు.
కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన లాయర్ శ్రీపాల్ అనే వ్యక్తి హీరో సుదీప్ నటించిన అన్ని బాషల సినిమాలు, ఆయన నటించిన ప్రకటనలు (యాడ్స్), టీవీ షోల కార్యక్రమాలు మొత్తం మే 13వ తేదీ వరకు టీవీలలో ప్రసారం కాకుండా బ్యాన్ చెయ్యాలని, ఆయన సినిమాల ప్రభావం ఓటర్ల మీద పడే అవకాశం ఉందని ఎన్నికల కమీషన్ కు మనవి చేశారు.

గురువారం మీడియాతో మాట్లాడిన లాయర్ శ్రీపాల్ హీరో సుదీప్ ను బుల్లి తెర మీద చూస్తే ఓటర్ల మీద ఆ ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే ఆయన సినిమాలు బ్యాన్ చెయ్యాలని ఎన్నికల కమీషన్ కు మనవి చేశామని వివరించారు. మొత్తం మీద స్టార్ హీరో కిచ్చా సుదీప్ సినిమాలు టీవీల్లో ప్రసారం కాకుండా ఎన్నికల కమీషన్ బ్యాన్ చేస్తుందా ? లేదా ? అని వేచిచూడాలి.












Click it and Unblock the Notifications