Leader:అధికార పార్టీ లీడర్ మాయం, లాయర్ కూడా, కాళ్లు, చేతులు కట్టేసి దారుణ హత్య, భార్య !

చెన్నై/ మదురై: ఎల్ ఎల్ బీ చేసిన యువకుడు రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నాడు. న్యాయవాదిగా పని చేస్తూనే అతనికి నచ్చిన పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. గత ఏడాది పొలిటికల్ లీడర్ కు పెళ్లి అయ్యింది. భార్యతో ఆ పొలిటికల్ లీడర్ సంతోషంగా కాపురం చేస్తున్నాడు. భార్య గర్బవతి కావడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. భార్యను చూసిరావడానికి అతను అప్పుడప్పుడు అత్తారింటికి వెళ్లి వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన పొలిటికల్ లీడర్ ఆచూకిలేదు.

కొడుకు అత్తారింటికి వెళ్లి ఉంటాడని అతని తల్లిదండ్రులు, ఇంట్లో ఉంటాడని అతని భార్య కొన్ని రోజులు అనుకున్నారు. ఓ వ్యవసాయ పొలంలో యువకుడి శవాన్ని స్థానికులు గుర్తించారు. కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేసి శవాన్ని గోనె సంచిలో మూటకట్టి వ్యవసాయ బావిలో విసిరేయడం, శవం కుళ్లిపోయి ఉండటంతో మొదట హత్యకు గురైయ్యింది ఎవరు ? అనే విషయం అంతుచిక్కలేదు. చివరికి హత్యకు గురైన వ్యక్తి న్యాయవాది, అధికార పార్టీ లీడర్ అని వెలుగు చూడటం కలకలం రేపింది.

 న్యాయవాది, అధికార పార్టీ లీడర్

న్యాయవాది, అధికార పార్టీ లీడర్

తమిళనాడులోని మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని కల్లుపట్టి లో బాలాజీ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఎల్ ఎల్ బీ పూర్తి చేసిన బాలాజీ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు వ్యవసాయం, వ్యాపారం చేస్తుండటంతో లాయర్ గా పని చేస్తున్న బాలాజీ డీఎంకే పార్టీలో చేరి ఆ పార్టీ యువజన విభాగం నాయుడిగా పని చేస్తున్నాడు.

 భార్య గర్బవతి

భార్య గర్బవతి

బాలాజీ న్యాయవాదిగా పని చేస్తూనే అతనికి నచ్చిన డీఎంకే పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. గత ఏడాది కోవిల్ పట్టీకి చెందిన దర్శిని అనే యువతిని పొలిటికల్ లీడర్ బాలాజీ పెళ్లి చేసుకున్నాడు. భార్య దర్శినితో పొలిటికల్ లీడర్ బాలాజీ చాలా సంతోషంగా కాపురం చేస్తున్నాడు. భార్య దర్శిని గర్బవతి కావడంతో తమిళనాడులోని కోవిల్ పట్టిలో ఉన్న ఆమె పుట్టింటికి వెళ్లింది.

 మాయం అయిన పొలిటికల్ లీడర్

మాయం అయిన పొలిటికల్ లీడర్

భార్య దర్శినిని చూసిరావడానికి బాలాజీ అప్పుడప్పుడు కోవిల్ పట్టిలోని అత్తారింటికి వెళ్లి వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన పొలిటికల్ లీడర్ బాలాజీ ఆచూకిలేదు. కొడుకు బాలాజీ అత్తారింటికి వెళ్లి ఉంటాడని అతని తల్లిదండ్రులు, ఇంట్లో ఉంటాడని బాలాజీ భార్య ఇన్ని రోజులు అనుకున్నారు.

 శవమైన బాలాజీ

శవమైన బాలాజీ

సుబ్బలాపురం గ్రామం సమీపంలోని సిత్తులోట్టిపట్టి ప్రాంతంలోని వ్యవసాయ పొలంలో ఓ యువకుడి శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేసి శవాన్ని గోనె సంచిలో మూటకట్టి వ్యవసాయ బావిలో విసిరేయడం, శవం కుళ్లిపోయి ఉండటంతో మొదట హత్యకు గురైయ్యింది ఎవరు ? అనే విషయం అంతుచిక్కలేదు.

 హత్యకు గురైయ్యింది పొలిటికల్ లీడర్

హత్యకు గురైయ్యింది పొలిటికల్ లీడర్

పోస్టుమార్టం నివేదిక తరువాత వ్యవసాయ బావిలో చిక్కిన శవం లాయర్, డీఎంకే పార్టీ నాయకుడు బాలాజీది అని వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ నాయకుడు, న్యాయవాది అయిన బాలాజీని ఎవరు హత్య చేశారు ?, హత్య ఎందుకు జరిగింది ? అని ఆరా తీస్తున్నామని మదురై జిల్లా పోలీసులు తెలిపారు. బాలాజీ భార్య దర్శినిని కూడా విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+