వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్‌ఫోన్స్ సంచలనం: ఒకే రోజులో 7.5లక్షల అమ్మకాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజ సంస్థ 'లీ ఇకో' రెండో తరానికి చెందిన సూపర్ ఫోన్ల అమ్మకాల్లో దూసుకెళ్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 7లక్షల 50వేలకుపైగా సూపర్ ఫోన్లు అమ్ముడుపోయాయని కంపెనీ ప్రకటించింది. దీంతోపాటు లీమాల్.కామ్‌లో దాదాపు 2 కోట్ల 30 లక్షల (23మిలియన్) రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు పేర్కొంది.

లీ మాక్స్2 కేవలం 57 సెకండ్లలో అమ్ముడవగా, లీ2 మోడల్ 8.26 నిమిషాల్లో అమ్ముడుపోయాయని కంపెనీ తెలిపింది. అదేవిధంగా నాలుగో తరానికి చెందిన సూపర్ టీవీ రిజిస్ట్రేషన్లు కూడా కోటి ఎనభై లక్షలు(18 మిలియన్లు) దాటిందని కంపెనీ వెల్లడించింది.

suprerphones

కాగా, లీ ఇకో కంపెనీకి చెందిన ఉత్పత్తుల్లో కొత్త శ్రేణికి చెందిన వాటిని కంపెనీ గతవారం బీజింగ్‌లో ప్రవేశపెట్టింది. మొబైల్, టీవీ, ఆటోమోటివ్, వీఆర్ లాంటి వివిధ రకాల మోడళ్లను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 153గ్రాముల బరువు, 8.5ఎంఎం వెడల్పు, 151ఎంఎం పొడవు, యూఎస్ బీ టైప్-సీ ఆడియో పోర్టు ఫీచర్ కంటిన్యూల్ డిజిటల్ లాస్ లెస్ ఆడియో టెక్నాలజీతో మాక్స్2 ను కంపెనీ రూపొందించింది.

6జీబీ మెమరీ, 64జీబీ విస్తరణ మెమరీతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 820 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో 5.7 అంగుళాల క్యూహెచ్ డీ డిస్‌ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంది.

అంతేగాక, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్‌తో చుట్టిన లీ ఇకో కస్టమైజిడ్ ఈయూఐ 5.5, 3100 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, కనెక్టివిటీ ఆప్షన్లలో 802.11ఎసీ వైఫై, 4జీ ఎల్టీఈ, జీపీఎస్ లు మాక్స్ 2 ప్రత్యేకతలు. 16 ఎంపీ ఎఫ్/2 వెనుక కెమెరా, దీంతో పాటు ఎల్ఈడీ, పీడీఏఎఫ్ ప్లాస్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్లు లభ్యమవుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X