నువ్వు బ్రదర్ అసలైన మగాడు, మొగుడు అంటే..!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం, దాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అలాంటిది ఓ వ్యక్తి తన భార్య కోసం సంవత్సరానికి రూ.1.2 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఈ ఆశ్చర్యకరమైన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంగళూరులోని జయనగర్‌లో నివసించే ఓ వ్యక్తి, కాలేజీ డ్రాపవుట్ అయినప్పటికీ ఏడేళ్ల కష్టంతో అగ్రస్థాయికి ఎదిగాడు. అతడు ఇంట్లో నుంచే పనిచేస్తూ సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా జీతం సంపాదిస్తున్నాడు. అయితే ఇటీవల అతని భార్య గర్భవతి కావడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

గర్భంతో ఉన్న తన భార్యకు ఒక సంవత్సరం పాటు ఉద్యోగానికి విరామం ఇవ్వమని చెప్పగా, ఆమె అందుకు నిరాకరించింది. దీంతో ఆ భర్త, తానే ఉద్యోగానికి రాజీనామా చేసి, భార్యకు తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఈ ప్రత్యేక సమయంలో ఆమెకు ఇంటి పనుల్లో సహాయం చేయడం, వాకింగ్‌కు తీసుకెళ్లడం, ఆమెతో పాటు కుటుంబంతో ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నాడు.
తన అనుభవంతో భవిష్యత్తులో మళ్లీ మంచి ఉద్యోగం సంపాదించుకోగలనని, కానీ ఈ అపురూప క్షణాలను కోల్పోకూడదని అతను Redditలో పంచుకున్నాడు. ఆర్థికంగా తాను ఈ నిర్ణయం తీసుకోగల స్థితిలో ఉండటం తన అదృష్టమని కూడా చెప్పాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, అందరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.












Click it and Unblock the Notifications