నేటి నుంచి వందే భారత్ టూర్..: కొత్త టై-అప్
న్యూఢిల్లీ: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 33 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
ఈ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరతగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.

ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ- మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది. ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. 2024 ఫిబ్రవరి నాటికి ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.
ఈ వందే భారత్ రైళ్లతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ (Legends league cricket tournament) టై అప్ అయింది. దేశవ్యాప్తంగా ఈ లీగ్ ట్రోఫీని ఊరేగించననున్నారు నిర్వాహకులు. దీనికోసం రైల్వే మంత్రిత్వ శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేశంలో క్రీడారంగాన్ని మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
నేటినుంచి వందే భారత్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ ట్రోఫీ టూర్ ఆరంభం కానుంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ రైలు ట్రావెల్ చేస్తుంది. 15 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది. నార్త్, సౌత్, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ రైల్వే జోన్ల మీదుగా ఈ వందే భారత్ టూర్ రైలు రాకపోకలు సాగిస్తుంది.
ఈ నెల 18వ తేదీ నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మొదలవుతుంది. ఇది రెండవ ఎడిషన్. మొత్తం ఆరు జట్లు- ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయింట్స్, అర్బన్ రైజర్స్ హైదరాబాద్, సదరన్ సూపర్ స్టార్స్, భిల్వారా కింగ్స్.. ట్రోఫీ కోసం పోరాడనున్నాయి. డిసెంబర్ 9వ తేదీన ఫైనల్.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications